ఒళ్ళమ్ముకుని డబ్బులు సంపాదించాలని సినిమా ఇండస్ట్రీ కి వస్తున్నారంటూ...

తెలుగులో పలు మెసేజ్ ఓరియెంటెడ్ మరియు పోరాటపటిమగల చిత్రాలకు దర్శకత్వం వహించి ప్రేక్షకులను బాగానే అలరించిన తెలుగు ప్రముఖ డైరెక్టర్ "బాబ్జీ" సినీ ప్రేక్షకులకు సుపరిచితమే.

కాగా తాజాగా దర్శకుడు బాబ్జీ ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొని తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి "క్యాస్టింగ్ కౌచ్" సమస్యలపై స్పందించి సంచలన వ్యాఖ్యలు చేశాడు.

ఇందులో భాగంగా క్యాస్టింగ్ యొక్క సమస్య అనేది సినిమా పరిశ్రమ పుట్టినప్పటినుంచి ఉందని కాకపోతే గతంలో క్యాస్టింగ్ కౌచ్ అనేది కేవలం నాలుగు గోడల మధ్య ఇద్దరికీ ఇష్టమైతేనే జరిగేదని కానీ ప్రస్తుత కాలంలో అంతా ఓపెన్ అయిందని దాంతో ఎక్కువగా సినిమా ఇండస్ట్రీ గురించి బాహ్య ప్రపంచంలో చెడుగా మాట్లాడుకుంటున్నారని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

దీనికితోడు ఈ మధ్య కాలంలో కొందరు ఒళ్ళు అమ్ముకొని డబ్బులు సంపాదించాలని ఆలోచించే వాళ్ళు ఎక్కువగా సినిమా ఇండస్ట్రీకి వస్తున్నారని దాంతో మొత్తం బ్రష్టు పట్టిస్తున్నారని తెలిపాడు.

అలాగే గతంలో చాలామంది నటీనటులు నటనపై ఉన్న ఆసక్తి మరియు కథల పట్ల అంకితభావం వంటి కారణాలతో సినిమా ఇండస్ట్రీకి వచ్చేవాళ్ళని కానీ ఇప్పుడు కేవలం డబ్బు సంపాదించడానికి మాత్రమే సినిమా ఇండస్ట్రీకి వస్తున్నారని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

అయితే గతంలో కొందరు దర్శక నిర్మాతలకి మాత్రమే ఈ కాస్టింగ్ కౌచ్ కి పాల్పడే అవకాశాలు ఉండేవి కానీ ఈ మధ్య కాలంలో కోడైరెక్టర్లు, మేకప్ మెన్లు మరియు ఇతర జూనియర్ ఆర్టిస్టులు తదితరులు కూడా అవకాశాల పేరుతో నటీనటులను దారుణంగా వాడుకొని వదిలేస్తున్నారని చెప్పుకొచ్చాడు.

"""/"/ అయితే ఇందులో ముఖ్యంగా నటన పై ఉన్నటువంటి ఆసక్తి మరియు ఎలాగైనా అవకాశాలను దక్కించుకుని సినిమా ఇండస్ట్రీలో రాణించాలని కోరికలు ఉండడమేనని తెలిపాడు.

అంతేగాక ఈ మధ్య కాలంలో కొందరు సీరియల్ సినిమా షూటింగులు లొకేషన్లలో పక్కన ఆడవాళ్ళు ఉన్నారనే ఇంగితజ్ఞానం లేకుండా అసభ్యకర పదజాలం ఉపయోగిస్తూ మాట్లాడుకుంటున్నారని, """/"/ అలాగే బోల్డ్ సన్నివేశాలు మరియు రేప్ సన్నివేశాలలో ఎలా నటించాలో చూపించే నెపంతో అసభ్యకరంగా తాకడం, అసభ్యకరంగా మాట్లాడడం వంటివి చేస్తున్నారని ఇది సరి కాదని తెలిపాడు.

అప్పట్లో ఏదైనా ఓ సన్నివేశం గురించి వివరించే ముందు దర్శకుడు లేదా సహ దర్శకుడు నటితో వ్యక్తిగతంగా మాట్లాడే వాళ్ళని కానీ ఇప్పుడు పది మంది ముందు చూస్తుండగానే అసభ్యకరంగా చేతులు వేస్తూ మాట్లాడుతూ నటీనటులతో ఇబ్బందికరంగా ప్రవర్తిస్తున్నారని సినిమా ఇండస్ట్రీలో ఇలాంటివి మారాలని తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!