డ్యాన్సర్స్ గా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి యాక్టర్స్ గా సెటిల్ అయినా వాళ్ళు వీరే..!
TeluguStop.com
నటీనటులంటే డ్యాన్సుల నుంచి ఫైటింగ్ ల వరకు అన్నీ నేర్చుకోవాల్సిందే.భాష రాకపోయినా మేనేజ్ చేయొచ్చుకాని.
డ్యాన్సలు చేయాల్సిందే.కొందరు సినీ పరిశ్రమలోకి వచ్చాక డ్యాన్సులు నేర్చుకుంటే.
మంది డ్యాన్సులు నేర్చుకుని సినీ ఫీల్డ్ లోకి వచ్చిన వారు కూడా ఉన్నారు.
క్లాసికల్ డ్యాన్సు నేర్చుకుని ఎన్నో ప్రదర్శనలు ఇచ్చిన వారూ ఉన్నారు.శోభన, భానుప్రియ, సాయిపల్లవి, శీరత్ కపూర్ లు ఇలా వచ్చిన వారే.
వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నాట్య మయూరి సుధా చంద్రన్ గురించి.చిన్ననాటి నుంచే క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకున్న సుధా చంద్రన్.
ప్రమాదంలో ఓ కాలు పోగొట్టుకున్నారు.అయినా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఆర్టిఫీషియల్ కాలుతో తన కల నెరవేర్చుకున్నారు.
తన జీవిత కథ ఆధారంగా తెరకిక్కిన మయూరి సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.
తర్వాత పలు సినిమాల్లో నటించింది.ప్రస్తుతం బుల్లితెరపై హిందీ నుంచి తెలుగు వరకు పలు సీరియల్స్ లో నటిస్తూ దూసుకుపోతుంది.
"""/"/
శోభన.ఆమె కూడా ఓ క్లిసికల్ డ్యాన్సరే.
తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ సినిమాల్లో హీరోయిన్ గా నటించిన శోభన జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది.
సినిమాల్లోకి రాకముందే ఎన్నో ప్రదర్శనలు ఇచ్చింది.ఇప్పటికీ స్టేజ్ షోలు ఇస్తున్నారు.
ఓ డ్యాన్సింగ్ ఇన్ స్టిట్యూట్ ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తున్నారు. """/"/
క్లాసికల్ డ్యాన్స్ అంటే తెలుగు ప్రేక్షకులకు గుర్తొచ్చేది భానుప్రియ.
అందమైన కళ్లతో హావభావాలు పలికిస్తూ.ప్రేక్షకుల మనసు దోచింది.
తల్లి కోరిక మేరకు క్లిసికల్ డ్యాన్స్ నేర్చుకుంది.ఎన్నో ప్రదర్శనలు ఇచ్చింది.
ఆమె డ్యాన్స్ చూసే సినిమాల్లో అవకావశం ఇచ్చారు.స్టార్ హీరోల పక్కన నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన భానుప్రియ.
గత కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటుంది. """/"/
అందం , అభినయం కలిసి ఉన్న నటి సాయి పల్లవి.
తనకు నచ్చిన పాత్రాలు చేసే సాయి పల్లవి కూడా డ్యాన్సరే.ఈటీవీ ఢీ షోలో పార్టిసిపేట్ చేసింది.
తర్వాత సినిమాల్లో హీరోయన్ ఛాన్స్ కొట్టేసి.స్టార్ హీరోల సరసన నటిస్తూ దూసుకుపోతుంది.
"""/"/
కమెడియన్ గా, హీరోగా, విలన్ గా టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సునీల్ .
ఒకప్పుడు డ్యాన్సర్.ఓ షోలో డ్యాన్సర్ గా పోటీ చేశాడు.
తర్వాత కమెడియన్ గా సినిమాల్లో ఎంట్రీ ఇచ్చాడు.హీరోగా మారిన సునీల్.
ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా దూసుకుపోతున్నాడు. """/"/
రన్ రాజా రన్ తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన శీరత్ కపూర్ మంచి డ్యాన్సర్.
బాలీవుడ్ లో పలువురు కొరియోగ్రాఫర్ల దగ్గర అసిస్టెంట్గా పనిచేసింది.ఓ డ్యాన్స్ ఇన్ స్టిట్యూట్ స్థాపించి శిక్షణ ఇస్తుంది.
"""/"/
చిన్న వయస్సుకే ఆత్మహత్య చేసుకుని తనువు చాలించిన సుశాంత్ సింగ్ రాజ్ పూత్ కూడా ఒకప్పుడు డ్యాన్సరే.
ఇంజినీరింగ్ చదివే రోజుల్లో డ్యాన్స్ నేర్చుకున్నాడు.ఈ క్రమంలో బ్యాక్ గ్రౌండ్ డ్యాన్సర్ గా కూడా చేశాడు.
తర్వాత సీరియల్స్, రియాలిటీ షోలు, సినిమాలు చేస్తూ మంచి హీరోగా ఎదిగాడు.చిన్న వయసులోనూ కన్నుమూశాడు.
"""/"/
తెలుగు, తమిళం, మళయాళం భాషల్లో నటుడిగా గుర్తింపు తెచుకున్న వినీత్ కూడా క్లాసికల్ డ్యాన్సరే.
శోభనకు బంధువైన వినీత్.ఆమెతో పాటు డ్యాన్స్ నేర్చుకున్నాడు.
సినిమాల్లో కొన్ని పాటలకు కంపోజ్ కూడా చేశాడు. """/"/
కొరియోగ్రాఫర్ గా ,నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్న లారెన్స్ కూడా జూనియర్ డ్యాన్సర్ స్థాయి నుంచి ఈ స్థాయికి ఎదిగాడు.
"""/"/
ప్రస్తుతం బాలివుడ్ లో స్టార్ హీరోగా పేరుపొందిన షాహిద్ కపూర్.ఒకప్పుడు జూనియర్ డ్యాన్సర్ గా పనిచేశాడు.
సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నా మొదట్లో చాలా ఇబ్బందులు పడ్డాడు.అన్ని కష్టాలను అధిగమించి అంచెలంచెలుగా ఎదుగుతూ స్టార్ హీరో స్థాయికి ఎదిగాడు.
"""/"/
స్పెషల్ సాంగ్ ల ద్వారా హిందీ సినిమాల్లో గుర్తింపు తెచ్చుకున్న నోరా ఫతేహి డ్యాన్సరే.
ప్రస్తుతం హీరోయిన్ పాత్రలనూ చేస్తూ దూసుకుపోతుంది.అంతేకాదు బాలివుడ్ లో పలుసినిమాల్లో పాటలకు కొరియోగ్రఫీ కూడా చేసింది.
పవన్ కళ్యాణ్ ప్రీ రిలీజ్ వేడుకకు వస్తే సినిమా ఫ్లాపేనా… ఇదేం లాజిక్?