నో టెన్షన్.. ఆ క్రేజీ కాంబినేషన్స్ రాబోతున్నాయి?

సాధారణంగా ఎప్పుడూ హీరోల అభిమానులు కొన్ని క్రేజీ కాంబినేషన్స్ ని ఊహించు కుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.

ఇలా ప్రేక్షకులనూ ఊహల్లో ఉన్న క్రేజీ కాంబినేషన్స్ ఇక అటు సినిమాల్లో కూడా కొన్ని కొన్ని సార్లు నిజం అవుతూ ఉంటాయి.

ఈ క్రమంలోనే సినీ ప్రేక్షకులు అందరూ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న కొన్ని హీరో డైరెక్టర్ క్రేజీ కాంబినేషన్స్ మరికొన్ని రోజుల్లో సెట్స్ పైకి వెళ్లబోతున్నాయి అన్నది తెలుస్తుంది.

ఇక ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.కేవలం నెల గ్యాప్ లోనే త్రిబుల్ ఆర్, ఆచార్య లాంటి భారీ అంచనాలు ఉన్న సినిమాలతో ప్రేక్షకులను పలకరించపోతున్న రామ్ చరణ్.

తన తర్వాత సినిమా పైనే కాన్సన్ట్రేట్ చేయబోతున్నారు.ఇప్పటికే దిల్ రాజు బ్యానర్లో శంకర్ సినిమా పట్టాలెక్కించిన మెగా పవర్ స్టార్.

అదే సమయంలో యువ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తో సినిమాకు రెడీ అయిపోయాడు.

స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కబోతుంది.ఇక మరో హీరో ఎన్టీఆర్ కూడా వరుస సినిమాలకు రెడీ అవుతున్నాడు.

త్రిబుల్ ఆర్ విడుదలైన తర్వాత కొరటాల శివ సినిమాతో ముహూర్తం ఫిక్స్ చేసుకున్నాడు ఎన్టీఆర్.

"""/"/ అదే సమయంలో మహేష్ త్రివిక్రమ్ మూవీ కూడా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లబోతోంది అని తెలుస్తోంది.

ఇకపోతే త్రివిక్రమ్ పంచ్ డైలాగులకు మహేష్ టైమింగ్ కి బాగా సెట్ అవుతుంది.

దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.ఇప్పటికే సర్కారు వారి పాట సినిమా పూర్తి చేసిన మహేష్ త్రివిక్రమ్ తో సినిమాకు రెడీ అయ్యాడు.

వినోద సిద్ధం, విక్రమ్ వేద రీమేక్స్ అంటూ టాక్ వినిపిస్తున్నా.హరిహర వీరమల్లు పూర్తయిన తర్వాత పవన్ సినిమా హరీష్ శంకర్ తో నే ఉండబోతోందని తెలుస్తోంది.

ఇక భవదీయుడు భగత్ సింగ్ ఈ సినిమాపై భారీ రేంజిలో అంచనాలు ఉన్నాయి.

"""/"/ ఇక గ్యాప్ లేకుండా బాక్సాఫీస్ ని బద్దలు కొట్టి ఎందుకు సిద్ధమవుతున్నారు పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ.

లైగర్ సినిమా తర్వాత జనగణమన అని నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా లైన్ క్లియర్ చేశారు.

షూటింగ్ వచ్చే నెల నుంచి స్టార్ట్ కాబోతుంది.ఈ సినిమాలో హీరోయిన్ జాన్వికపూర్ ని తీసుకున్నారు అంటూ టాక్ వినిపిస్తోంది.

ఇక కోలీవుడ్ హీరో ఇళయదళపతి టాలీవుడ్ లో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చేందుకు ముహూర్తం ఖరారు అయినట్లు తెలుస్తోంది.

వంశీ పైడిపల్లి దిల్ రాజు సినిమా ఇక ఈ ఉగాదికి ఇళ్ల పట్టాలు ఎక్కే అవకాశం ఉందని తెలుస్తోంది.

కార్తీ సత్యం సుందరం మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలివే.. ఆ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందా?