టాలీవుడ్ ఇండస్ట్రీలో పెరిగిపోతున్న ఆ వివాదాలు..??

టాలీవుడ్( Tollywood ) ఇండస్ట్రీలో సినిమా ప్రెస్‌మీట్లు వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి.

సినిమా కథ, పాటల గురించే కాకుండా కాపీ సీన్లు, అన్‌సెన్సార్డ్‌, డర్టీ డైలాగుల గురించి కూడా జర్నలిస్టులు ప్రశ్నిస్తున్నారు.

అయితే మొన్నటిదాకా ఈ క్వశ్చన్లు సినిమా అంశాలకు మాత్రమే పరిమితం అయ్యాయి కానీ ఇప్పుడు దిక్కుమాలిన ప్రశ్నలు అడుగుతున్నారు.

ప్రశ్నలే చెత్తగా ఉంటే ఆన్సర్లు మరింత చెత్తగా ఉంటున్నాయి.కొంతమంది డైరెక్టర్లు సినిమా జర్నలిస్టులను కావాలనే గోక్కుంటున్నారు.

అందువల్ల ఈ ప్రెస్‌మీట్లు అనేవి వరస్ట్‌గా మారుతున్నాయి.ఉదాహరణకు మిస్టర్ బచ్చన్ మూవీ( Mr.

Bachchan Movie ) టీమ్ మీడియా ఇంట్రాక్షన్ సమయంలో హరీష్ శంకర్‌ సినిమా ( Harish Shankar Movie )జర్నలిస్టులను ఓ పిచ్చి ప్రశ్న వేశారు.

"సినీ జర్నలిస్టులు యాంకర్ సుమతో వేదిక మీద క్షమాపణలు చెప్పించారు కదా, మరి జర్నలిస్ట్ కొండేటి సురేష్‌తో అదే మాట ఎందుకు చెప్పించలేకపోయారు?" అని హరీష్ ఒక ప్రశ్న వేశాడు.

నిజానికి ఈ ప్రశ్న అడగడం అనవసరం.సినిమా జర్నలిస్టులను గెలికితే చాలా ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి.

"""/" / కానీ హరీష్ శంకర్ వాళ్లపై విరుచుకుపడుతున్నాడు.మరోవైపు హీరోయిన్ నేహా శెట్టి( Neha Shetty ) మీద సురేష్ కొండేటి ఓ పిచ్చి కామెంట్ చేశాడు.

దాంతో ఆమె చాలా ఫైర్ అయ్యింది.చివరికి సురేష్ కొండేటి ( Suresh Kondeti )తప్పయింది అంటూ లెంపలేసుకున్నాడు.

ఇవన్నీ చాలా చిన్న వివాదాలు.ఇవి జరగడం కామన్.

కానీ ఆ పాతవన్నీ తవ్వితే ఈ చిన్న కాంట్రవర్సీలు కాస్త పెద్దవిగా మారతాయి.

హరీష్ శంకర్ ఇలాంటి పెద్ద గొడవలు చేయాలని ఎందుకు చూస్తున్నాడో అర్థం కావడం లేదు.

"""/" / నిజానికి స్నాక్స్‌ను భోజనంలా తినేయకండి అని సుమ జోక్ వేయడంలో తప్పులేదు.

ఆమెకు అందరి సినీ జర్నలిస్టుతో మంచి చనువు ఉంది, ఎవరో మనసును నొప్పించాలనే ఉద్దేశంతో ఆమె ఆ కామెంట్ చేసి ఉండదు.

నిజానికి ఎక్కడ ఏం మాట్లాడాలో ఆమెకు బాగా తెలుసు.తను మాట్లాడే మాటలు కాంట్రవర్సీకి ఆమడ దూరం ఉంటాయి.

కానీ ఎవరో ఓ జర్నలిస్టు అనవసరంగా హార్ట్ అయిపోయి ఆమెపై అరిచేసాడు.దాంతో సుమ తనంతట తానే సినీ జర్నలిస్టులు అందరికీ సారీ చెప్పింది.

ఆమెతో ఏ జర్నలిస్టు బలవంతంగా క్షమాపణలు చెప్పించలేదు.కొద్ది రోజుల క్రితం నటి రోహిణి ఎవరో సీనియర్ జర్నలిస్టు ఓవరాక్షన్‌ చేస్తే కడిగిపారేసింది.

జర్నలిజం పోకడనే అలా తయారవుతున్నాయి.

పాలు, అంజీర్ క‌లిపి తీసుకుంటే ఎన్ని ఆరోగ్య లాభాలో తెలుసా?