వీళ్ల మాటలు అర్థం కావాలంటే మినిమమ్ డిగ్రీ చదివి ఉండాలి..?? 

సాధారణంగా సెలబ్రిటీలు ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్స్‌లో చాలా తెలివిగా మాట్లాడుతుంటారు.వాళ్ల మాటలకు డబుల్ మీనింగ్స్ వస్తాయి కాబట్టి వాటిని సాధారణ ప్రజలు అర్థం చేసుకోలేరు.

వాళ్ళ మాటలు అర్థం కావాలంటే మినిమం డిగ్రీ చదివి ఉండాలని మరి కొంతమంది అంటుంటారు.

తెలుగు సినిమాల గురించి మాట్లాడేటప్పుడు కూడా కొందరు యాక్టర్స్ ఇలాంటి మాటలు మాట్లాడి ఆశ్చర్యపరిచారు.

వాళ్లు ఎవరో తెలుసుకుందాం.h3 Class=subheader-style• శివాని రాజశేఖర్ /h3p( Shivani Rajasekhar ) బుచ్చి బాబు డైరెక్ట్ చేసిన ఉప్పెన సినిమా( Uppena Movie ) 15 కోట్లతో తెరకెక్కింది.

అయితే ఇది బాక్స్ ఆఫీస్ వద్ద వంద కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

ఇందులో కృతి శెట్టి, పంజా వైష్ణవి తేజ్ హీరో హీరోయిన్లుగా నటించారు.అయితే హీరోయిన్ ఛాన్స్‌ కృతి కంటే ముందుగా శివాని రాజశేఖర్ వద్దకు వెళ్లింది.

కానీ ఈ సినిమాలో రొమాన్స్ ఎక్కువగా ఉందని చెప్పి శివాని దానిని రిజెక్ట్ చేసిందట.

ఇంత మంచి ఛాన్స్ ఎందుకు పోగొట్టుకున్నావు అని అడిగితే అందులో రొమాన్స్ ఎక్కువగా ఉందని చెప్పింది.

అర్జున్ రెడ్డి లాంటి సినిమా అయితే తాను కచ్చితంగా నటించి ఉండేదాన్ని అని కూడా చెప్పింది.

జోక్ ఏంటంటే అర్జున్ రెడ్డి సినిమాలో హీరోయిన్ తో ఘాటైన రొమాంటిక్ సన్నివేశాలు ఉంటాయి.

బెడ్ రూమ్ సీన్స్ కూడా ఎక్కువే.అలాంటి రొమాంటిక్ సన్నివేశాలు చేయడంలో అభ్యంతరం లేదనట్లు ఆమె మాట్లాడింది.

ఉప్పెనలోని రొమాంటిక్ సన్నివేశాలు మాత్రం తనకు నచ్చలేదని ఆమె చెప్పడం ఎవరికీ అర్థం కాలేదు.

"""/" / H3 Class=subheader-style•నాగ్ అశ్విన్/h3p( Nag Ashwin ) కల్కి 2898 AD సినిమా( Kalki 2898 AD Movie ) 60% పూర్తయిందని ఒకానొక సమయంలో నిర్మాత అశ్విని దత్ చెప్పారు.

అయితే అదే సమయంలో నాగ్‌ అశ్విన్‌ కల్కి సినిమా కాస్త కూడా పూర్తి కాలేదని చెప్పి షాక్ ఇచ్చారు.

మరి ఆయన మాటలు వెనుక ఉన్న అంతరార్థం ఏంటో సాధారణ ప్రజలకు తెలియ రాలేదు.

ఏది ఏమైనా నాగ్ అశ్విన్ 1000 కోట్ల సినిమా తీసి ఇప్పుడు రాజమౌళి లాంటి దిగ్గజ దర్శకుల జాబితాలో చేరిపోయాడు.

"""/" / H3 Class=subheader-style• విజయ్ సేతుపతి/h3p( Vijay Sethupathi ) పుష్ప సినిమాలో విలన్ రోల్ విజయ్ సేతుపతికి దక్కిందని మొదట్లో చాలా వార్తలు వచ్చాయి.

ఇందులో ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే కూలిగా హీరో నటించాడు.వాస్తవానికి ఎర్రచందనం స్మగ్లింగ్ కు సంబంధించి తమిళనాడు ప్రజలకు ఒక చేదు అనుభవం ఉంది.

అందువల్ల ఈ సినిమాలో నటించకూడదని విజయ్ సేతుపతి నిర్ణయించుకున్నట్లు కూడా రూమర్స్ వినిపించాయి.

ఇంత మంచి సినిమాలో అవకాశం ఎందుకు కోల్పోయారు అని ఒక ఇంటర్వ్యూలో విజయ్ సేతుపతిని ప్రశ్నించారు.

అందుకు సమాధానంగా తనకు ఆ ఆఫరే రాలేదని చెప్పారు.అదే సమయంలో కొన్నిసార్లు అబద్ధాలు చెప్పాలి లేకపోతే ఇబ్బందుల్లో పడతాం అంటూ ఇన్ డైరెక్ట్ గా మాట్లాడారు.

దీన్ని బట్టి అతను ఆ ఆఫర్ రిజెక్ట్ చేసినట్టు స్పష్టంగా అర్థమైంది.

‘తౌబా తౌబా’ పాట‌కు ఆ క్రికెట్ దిగ్గ‌జం నిజంగానే స్టెప్పులు వేశాడా..? అస‌లు నిజం ఏంటంటే..?