ప్రేమకు వయసుతో పని ఏముంది.. అంటూ నిరూపించిన సెలబ్రిటీ జంటలు వీరే?
TeluguStop.com
ప్రతి ఒక్కరి జీవితంలో ప్రేమ అనేది ఒక మధురమైన అనుభూతి.రెండు మానసుల మధ్య ప్రేమ ఏ క్షణం లో పడుతుంది అన్నది కూడా చెప్పలేని విధంగానే ఉంటుంది.
చూపులు కలిసిన శుభవేళ రెండు మనసుల మధ్య ప్రేమ చిగురిస్తుంది.ఇక ఇలా ప్రేమ పుట్టినప్పుడు కులం మతం వయస్సు అనేది ఏది గుర్తుకు రాదు.
అందుకే ప్రేమ గుడ్డిది అని చెబుతూ ఉంటారు.ఇలా కేవలం సామాన్యులు మాత్రమే కాదు సినీ సెలబ్రిటీలు సైతం వయసుతో పనిలేకుండా ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుని ఎంతో సంతోషంగా జీవితాన్ని గడుపుతున్న వారు ఉన్నారు .
ఇక తనకంటే చిన్న వారిని లేదా పెద్దవారిని పెళ్లి చేసుకున్న సినీ సెలబ్రిటీల వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
తనకంటే వయసులో పదకొండేళ్ల చిన్నవాడైన నిక్ జోనాస్ ను ప్రేమించే వివాహం చేసుకుంది ప్రియాంక చోప్రా.
తరువాత ఈ అమ్మడి క్రేజ్ బాగా పెరిగిపోయింది.హాలీవుడ్లో కూడా అవకాశాలు వచ్చేసాయి.
తనకంటే వయసులో చిన్న వాడైనా పెద్ద మనసు ఉన్న వాడు అని అందుకే పెళ్లి చేసుకున్నాను అంటూ చెబుతుంది ప్రియాంక చోప్రా.
కొన్నాళ్ళ పాటు ప్రేమలో కొనసాగి మూడుముళ్ల బంధంతో ఒక్కటైన సెలబ్రిటీ లలో అనుష్క కూడా ఉన్నారు.
తనకంటే చిన్నవాడైన విరాట్ కోహ్లీ పెళ్లి చేసుకుంది.ఓ ప్రకటనలో ఇద్దరి మధ్య కుదిరిన స్నేహం ప్రేమగా మారి చివరికి పెళ్లి వరకు వెళ్ళింది.
"""/"/
సూపర్ స్టార్ మహేష్ బాబు తన కంటే వయసులో రెండేళ్ళు పెద్ద అయినా నమ్రతా శిరోద్కర్ ప్రేమలో పడిపోయాడు.
వయసుతో పని ఏమిటి అనుకొని పెళ్లి చేసుకున్నాడు.ఈ ఇద్దరికీ ప్రస్తుతం ఇద్దరు పిల్లలు ఉన్నారు.
అభిషేక్ బచ్చన్ సైతం తన కంటే రెండేళ్ల పెద్దది అయిన ఐశ్వర్య రాయ్ ని పెళ్లి చేసుకున్నాడు.
ఇక సైఫ్ అలీఖాన్ అమృతాసింగ్ ది కూడా వయసు వ్యత్యాసం చాలానే ఉంది.
సైఫ్ అలీ ఖాన్ కంటే అమృతాసింగ్ 10 ఏళ్ళు పెద్ద కావడం గమనార్హం.
పెళ్లి చేసుకున్న ఈ జంట మనస్పర్థల కారణంగా విడిపోయింది.ఆ తర్వాత తన కంటే చిన్నవయసు ఉన్న కరీనా కపూర్ ను పెళ్లి చేసుకున్నాడు.
"""/"/
ఇక బిపాసబసు తనకంటే చిన్నవాడైన కరణ్ సింగ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.
శిల్ప శెట్టి కూడా తన కంటే చిన్నవాడైన రాజ్ కుంద్రాను ప్రేమ వివాహం చేసుకుంది.
ఇప్పుడు డేటింగ్ లో ఉన్న 46 ఏళ్ల మలైకా త్వరలో అర్జున్ కపూర్ ను పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.
విశ్వసుందరి సుష్మితా సేన్ 15 చిన్నవాడైన రెహమాన్ పెళ్లి పీటలు ఎక్కబోతోంది.39 ఏళ్ల రణబీర్ కపూర్ 29 ఏళ్ళ ఆలియా భట్ ను పెళ్లి చేసుకోబోతున్నాడు.
రైలు డోర్ తెరుచుకోక పోవడంతో చేతికర్రతో పగలగొట్టిన వికలాంగుడు.. చివరకు? (వీడియో)