దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకుంటున్న సినీ స్టార్స్..

కాలం చిత్ర విచిత్రాలు చేస్తుంది.అవకాశం ఉన్నప్పుడే జాగ్రత్త పడాలి.

అవకాశాలు వస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనుకేసుకోవాలి.సినిమా రంగం అనేది నిలకడ లేనిది.

ఎప్పుడు అవకాశాలు వస్తాయో? ఎప్పుడు రాకుండా పోతాయో? చెప్పడం కష్టం.అందుకే.

వీలున్నప్పుడే అందినకాడికి దండుకోవాలి.ఆ తర్వాత హాయిగా జీవితాన్ని గడపాలి.

సేమ్ ఇదే పద్ధతిని పాటిస్తున్నారు సినిమా తారలు.వెండితెరపై వెలుగు వెలుగుతుండగానే.

వ్యాపారాల్లోకి అడుగు పెడుతున్నారు.ఒకప్పుడు నార్త్ కే పరిమితం అయిన ఈ పద్దతి.

ప్రస్తుతం సౌత్ లోనూ విస్తరించింది.ఇప్పటికే పలు యాడ్స్ తో పాటు సొంత బ్రాండ్లతో మార్కెట్ లోకి అడుగు పెడుతున్నారు.

కొందరు హోటల్స్, మరికొందరు రెస్టారెటంలు, ఇంకొందర్లు సెలూన్లు, మిగతా కొందరు జ్యువెలర్స్, ఇంకా కొందరు జిమ్స్ రంగంలోకి దిగుతున్నారు.

సౌత్ లో టాప్ రెస్టారెంట్లు సినిమా తారలవే కావడం విశేషం.టాలీవుడ్ టాల్ హీరో రానా బిజినెస్ లో బాగానే రాణిస్తున్నాడు.

విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీతో పాటు క్వాన్ అనే టాలెంట్ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ కూడా రన్ చేస్తున్నాడు.

అంతేకాదు.సెలబ్రిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో రానా డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు.

అటు తమిళ స్టార్ దళపతి విజయ్ కి చెన్నైలో భారీగా కల్యాణమండపాలు ఉన్నాయి.

విజయ్ తల్లి పేరు మీద చాలా ఫంక్షన్ హాల్స్ నెలకొల్పాడు.టాలీవుడ్ యంగ్ యాక్టర్ సందీప్ కిషన్ సినిమా హీరో మాత్రమే కాదు.

బిజినెస్ మ్యాన్ కూడా.హైదరాబాద్, సికింద్రాబాద్ లో వివాహ భోజనంబు పేరుతో పలు రెస్టారెంట్లు రన్ చేస్తున్నాడు.

"""/"/ అటు టాలీవుడ్ క్యూట్ బ్యూటీ తమన్నా కూడా బిజినెస్ లో బాగానే రాణిస్తుంది.

వైట్ అండ్ గోల్డ్ పేరుతో జ్యువెలరీ బ్రాండ్‌ కలిగి ఉంది.ఈ ఆన్‌లైన్ జ్యువెలరీ బ్రాండ్ నుంచి భారీగా డబ్బులు సంపాదిస్తుంది ఈ మిల్కీ బ్యూటీ.

అటు మహానటి కీర్తి సురేష్ సైతం బిజినెస్ రంగంలో బాగానే రాణిస్తుంది.తన మిత్రులతో కలిసి స్కిన్‌ కేర్‌ బ్రాండ్ల తయారీలో అడుగు పెట్టింది.

సక్సెస్ ఫుల్ గా బిజినెస్ కొనసాగిస్తుంది.

ద్యావుడా.. చైనా మహిళలు ఎన్ని పెళ్లిళ్లు చేసుకుంటున్నారో.. ఎంత సంపాదిస్తున్నారో తెలిస్తే..