అనంతపురంలో 13వ షోరూమ్‌ను మాంగళ్య షాపింగ్ మాల్ ప్రారంభించిన టాలీవుడ్ సెలబ్రిటీలు
TeluguStop.com
అనంతపురం, ఏప్రిల్ 2022 : దేశంలోని ఈ ప్రాంతంలో కుటుంబ యజమాన్యంలోని అతిపెద్ద వస్త్ర సామ్రాజ్యాలలో ఒకటైన ` మాంగళ్య షాపింగ్ మాల్, ఈరోజు అనంతపురంలో తన 13వ షాపింగ్ మాల్‌ను ప్రారంభించింది.
అనంతపురం పట్టణంలో ఏర్పాటైన ఈ మెగా షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టాలివుడ్ సెలబ్రిటీ నటీమణులు అనూ ఇమ్మాన్యుయేల్ & నభానటేష్ మరియు ‘డిజె టిల్లూ’ మూవీ ఫేం కథానాయకుడు సిద్దార్ధ ‘‘సిద్దూ’’ జొన్నలగడ్డ హాజరై మాల్‌ను లాంఛనంగా ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి ఇంకా హాజరైన గౌరవ అతిధులు శ్రీ టి రంగయ్య గారు, ఎంపీ, అనంతపురం ; శ్రీ ఎ.
వెంకటరామి రెడ్డి గారు, ఎమ్మెల్యే, అనంతపురం ; శ్రీ ఎం.వసీం సలీం గారు, మేయర్, మున్సిపల్ కార్పొరేషన్, అనంతపురం ; శ్రీ కె.
విజయ భాస్కర్ రెడ్డి గారు, డిప్యూటీ మేయర్, మున్సిపల్ కార్పొరేషన్, అనంతపురం ; శ్రీమతి వి.
సాహిత్య గారు, డిప్యూటీ మేయర్, మునిసిపల్ కార్పొరేషన్ అనంతపురం ; శ్రీమతి.కె.
జయలలిత గారు, 5వ డివిజన్ కార్పొరేటర్ ; మాంగళ్య షాపింగ్ మాల్స్ వ్యవస్థాపకులు పి.
ఎన్.మూర్తి, మాంగళ్య షాపింగ్ మాల్స్ చైర్మన్ కాసం నమ:శివాయ, మాంగళ్య షాపింగ్ మాల్స్ డైరెక్టర్లు, శ్రీకాసం శివప్రసాద్ మరియు పుల్లూరు అరుణ్‌లు కూడా హాజరైనారు.
అనూ ఇమ్మాన్యుయేల్ మాట్లాడుతూ అనంతపురంలో మాంగల్య షాపింగ్ మాల్ తమ 13వ షోరూమ్‌ను ప్రారంభించడం ఎంతో శుభదాయకమని అన్నారు.
సువిశాలమైన విస్తీర్ణంలో అతి పెద్ద మాల్‌ను ఇక్కడ ప్రారంభించడం అనంతపురం పట్టణానికి ఒక కీలక పరిణామని అన్నారు.
గతంలో అనంతపురం వాసులంతా పెళ్లి షాపింగ్‌ల కోసం బెంగుళూర్ లేదా చెన్నయ్‌లకు ఇంకా కాంచీపురంకు కూడా వెళ్లాల్సి వచ్చేదని, అయితే అనంతపురంలోనే మాంగళ్య షాపింగ్ మాల్ రావడంతో మీ అభిరుచికి తగ్గట్టుగా కావల్సినవన్నీ ఇక్కడ ఒకే చోట దొరుకుతాయన్నారు.
పెళ్లిళ్ళ కోసం, మహిళలు, పురుషులు మరియు పిల్లల కోసం విస్తృతమైన దుస్తుల శ్రేణి మరియు డిజైన్లు అందుబాటులో ఉన్నాయని అన్నారు.
అందాల నటి నభా నటేష్ మాల్‌ను ప్రారంభించిన తరువాత మాట్లాడుతూ, మాంగల్య షాపింగ్ మాల్ శరవేగంగా అభివృద్ధి చెందుతున్నది మరియు తెలుగు రాష్ట్రాల్లో గొప్ప విజయాన్ని సాధించింది.
ఇది ప్రతి ఒక్కరికీ అత్యుత్తమ స్టైల్ ఎంపికలను అందించే సంపూర్ణ కుటుంబ వస్త్రనందనం అన్నారు.
మాంగళ్య షాపింగ్ మాల్ అనతికాలంలోనే నాణ్యమైన మరియు మన్నికైన వస్త్రాలకు మారుపేరుగా తెలుగు రాష్ట్రాల్లో ఖ్యాతి గడిరచిందని, కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా అత్యాధునిక డిజైన్లను అందుబాటులో ఉంచి వారి మనస్సులను గెలుచుకుందని అన్నారు.
మాంగళ్య షాపింగ్ మాల్‌కు ఇది 13వ షోరూమ్ అన్నారు.సిద్ధార్థ్ ‘‘సిద్ధు’’ జొన్నలగడ్డ మాట్లాడుతూ, నేను గతంలో రాయలసీమకు వెళ్లాను, కానీ షోరూమ్ ప్రారంభోత్సవానికి రావడం ఇదే మొదటిసారి, ఇది మాంగళ్యకు 13వ మాల్, ఇది పూర్తి ఫ్యామిలీ షాపింగ్ మాల్.
మాంగళ్య విస్తరణను కొనసాగించడానికి మరియు భారతదేశంలో కనీసం 300 స్టోర్‌లను ఏర్పాటు చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
శ్రీ రంగయ్య మాట్లాడుతూ, అనంతపురంలో మాంగళ్య షాపింగ్ మాల్ అతిపెద్ద షాపింగ్ మాల్ అని, 350 మంది స్థానికులకు ఉపాధి కల్పించడం సంతోషంగా ఉందన్నారు.
మా అనంతపురం జిల్లాలో పెద్ద ఎత్తున ఉన్న చేనేత కార్మికుల నుండి వస్త్రాలను కొనుగోలు చేయవలసిందిగా మాంగళ్యను కోరుతున్నాను.
అనంతపురంలో షాపింగ్ చేయడానికి ఇటువంటి మరిన్ని పెద్ద బ్రాండ్‌ల కోసం ఎదురు చూస్తున్నాము.
ఈ నగరంలో మరిన్ని పెట్టుబడులు పెట్టండి మరియు ఇక్కడ ఉపాధి అవకాశాలను సృష్టించండి.
ఈ జిల్లాలో చేనేతకు అభివృద్ధి చెందడానికి అద్భుతమైన అవకాశం ఉంది, ఈ జిల్లాలో మాత్రమే ఇంకా సజీవంగా ఉంది, మిగిలిన అన్ని చోట్లా యంత్రాలతో నేస్తున్నారు.
శ్రీ వెంకటరామి రెడ్డి మాట్లాడుతూ, అనంతపురంకు అనేక కార్పొరేట్ సంస్థలు వస్తున్నాయని, ఈ నగరం అద్భుతమైన మౌలిక సదుపాయాలతో ప్రశాంత వాతావరణానికి ప్రసిద్ధి చెందిందని, చెన్నై, బెంగళూరు మరియు హైదరాబాద్‌లకు బాగా అనుసంధానించబడి ఉందని.
నగర ప్రజల కొనుగోలు శక్తిపై కరువు పరిస్థితులు మరియు కోవిడ్ ప్రభావం చూపలేదు మరియు కోవిడ్‌కు ముందు వలె వ్యాపారం దాదాపు సాధారణ స్థితికి చేరుకున్నది.
అనంతపురంలో మాంగళ్య బాగా అభివృద్ధి చెందుతుంది, వారు సరసమైన ధరలకు నాణ్యమైన ఉత్పత్తులను నిర్వహించాల్సిన అవసరం ఉంది, ప్రస్తుతం హైదరాబాద్ మరియు బెంగళూరుకు తమ షాపింగ్ కోసం వెళ్లే ప్రజలు ఇక నుండి ఇక్కడే షాపింగ్ చేస్తారు.
మాంగల్య 350 మంది స్థానికులకు ఉపాధి కల్పించింది, ఇది అభినందించాల్సిన విషయం.శ్రీ వసీం సలీమ్ మాట్లాడుతూ, మాంగళ్య ఐదు అంతస్తులలో సువిశాలంగా విస్తరించి ఉంది మరియు అన్ని వయసుల వారికి సరికొత్త డిజైన్‌లు మరియు ఎంపికలతో పూర్తి శ్రేణి దుస్తులను అందిస్తుంది, ఇందులో విశాలమైన పార్కింగ్ కూడా ఉంది.
మంచి సేవ, నాణ్యత మరియు ధర కస్టమర్‌లను ఇక్కడ షాపింగ్ చేసేలా ఉత్సాహపరుస్తుంది.
శ్రీ విజయ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ, అనంతపురం ఒక పెద్ద వ్యాపార మరియు వాణిజ్య కేంద్రంగా అభివృద్ధి చెందుతోందని మరియు ప్రసిద్ధ బ్రాండ్‌లు నగరానికి చేరుకుంటున్నాయని, మాంగళ్య సరసమైన ధరకు ఉత్పత్తులను కొనసాగిస్తే అది అనంతపురంలో బాగా రాణిస్తుందని అన్నారు.
మాంగళ్య ప్రారంభంతో ఇక్కడ పండుగ వాతావరణం నెలకొందని శ్రీమతి సాహితీ అన్నారు.అనంతపురంలో మంచి మౌలిక సదుపాయాలు ఉన్నాయి మరియు ఇక్కడ శాంతిభద్రతలు చక్కగా ఉన్నాయి.
ఇటువంటి మాల్స్ ప్రజలు ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు స్థానికంగా షాపింగ్ చేయడానికి వీలు కల్పిస్తాయి మరియు ఇకపై వారు హైదరాబాద్ మరియు బెంగళూరుకు వెళ్లవలసిన అవసరం లేదు.
మాంగల్య స్థానిక నేత కమ్యూనిటీ వారి నుండి వస్త్రాలను కొనుగోలు చేయడం ద్వారా వారిని ప్రోత్సహిస్తున్నందుకు అభినందనలు.
తెలుగు రాష్ట్రాలలో ఈ గ్రూపునకు ఇది 13వ షోరూమ్ కాగా, ఐదు అంతస్తులలో, 25,000 చదరపు అడుగుల సువిశాల విస్తీర్ణంలో విస్తరించి వున్న ఈ షోరూమ్‌లో ప్రతి ఒక్కరి అభిరుచికి అనుగుణంగా వారికి ఇష్టమైన కలెక్షన్‌లు అందుబాటులో ఉన్నాయని, మహిళల కోసం అనేక వెరైటీల చీరలు, లెహంగాలు, వెస్ట్రన్ వేర్, వెడ్డింగ్ వేర్, డ్రెస్ మెటీరియల్స్ మరియు మరెన్నో అందుబాటులో ఉన్నాయని, పిల్లలు మరియు యువత కోసం పార్టీ దుస్తులు, పండుగ దుస్తులు, రోజువారీ దుస్తులు, మహిళలకు ఫ్యాన్సీ చీరలు, డిజైనర్ దుస్తులు, కేటలాగ్ చీరలు, పెళ్లి పట్టు వస్త్రాలు, కాంచీపురం పట్టు చీరలు, ఉప్పాడ చీరలు, హై ఫ్యాన్సీ చీరలు, సల్వార్లు, కుర్తా పైజామాలు మరియు వారికి అవసరమైన ప్రతి ఒక్క దాని నుంచి ఎంపిక చేసుకోవచ్చు.
పురుషుల కోసం ట్రెండీ ధోతీలు, కుర్తీలు, షర్టులు, టీ`షర్టులు, ప్యాంట్లు, జీన్స్, వివాహ దుస్తులు, పండుగ దుస్తులు మరెన్నో అందుబాటులో ఉన్నాయని, పి యన్ మూర్తి తెలిపారు.
మాంగళ్య షాపింగ్ మాల్ తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా మేము అన్ని ప్రాంతాలకు విస్తరించనున్నాము.
తాజాగా అనంతపురం పట్టణంలో ఈ నూతన స్టోర్ ప్రారంభంతో తెలుగు రాష్ట్రాలలో మా విస్తరణ పరంపర కొనసాగుతున్నదని కాసం నమ:శివాయ తెలిపారు.
ఈ కష్ట సమయాల్లో మా కస్టమర్లు ఎదుర్కొంటున్న నగదు కొరతను పరిగణనలోకి తీసుకుంటూ, కస్టమర్లు పెళ్లిళ్ల సీజన్‌ను ఉత్సాహంతో మరియు ఆనందంతో జరుపుకునేందుకు వీలుగా, ఆకర్షణీయమైన ఆఫర్లతో పాటు సరసమైన ధరలతో అద్బుతమైన వస్త్ర శ్రేణిని అందుబాటులో ఉంచాము.
మాంగళ్య షాపింగ్‌మాల్ గురించి :
1942 సంవత్సరంలో ఒక రిటైల్ ఫ్యాషన్ స్టోర్‌గా ప్రారంభమైన కాసం గ్రూప్‌కు చెందిన మాంగళ్య షాపింగ్ మాల్ 2019 నాటికి కుటుంబ వ్యాపారపు అతిపెద్ద టెక్స్‌టైల్ కింగ్‌డమ్‌గా అవతరించింది.
మొత్తం 12 స్టోర్లతో అతిపెద్ద నెట్‌వర్క్‌తో, 7000 మందికి పైగా ఉద్యోగులను కలిగివుండడంతో పాటు మొత్తం స్టోర్లు 3,00,000 చదరపు అడుగులకు పైగా విస్తీర్ణాన్ని కలిగివున్నాయి.
తెలంగాణలోని మరే ఇతర వస్త్రశ్రేణి మాల్స్ అందించని రీతిలో మాంగళ్య షాపింగ్‌మాల్ తన కస్టమర్ల యొక్క ఫ్యాషన్ ఆకాంక్షలకు మరియు స్టయిల్స్‌కు అత్యధిక ప్రాధాన్యాతనిస్తూ అన్నింటికిమించి కస్టమర్ల డబ్బుకు తగిన విలువనిస్తూ, అద్బుతమైన కలర్లు మరియు స్టయిల్స్‌లో విస్త్రతశ్రేణికి చెందిన డిజైన్లు మరియు కలెక్షన్లును అత్యంత నాణ్యతగా అందించడంలో తన నిబద్దతను చాటుకుంటున్నది.
వివాహ వేడుకుల చీరలకు ప్రసిద్దిగాంచిన మాంగళ్య షాపింగ్ మాల్ మునుపెన్నడూ లేనివిధంగా వివాహా వేడుకల కలెక్షన్ మరియు డిజైన్లను ప్రత్యేకంగా అందిస్తున్నది.
మాంగళ్య షాపింగ్‌మాల్ వారి విస్త్రృత శ్రేణికి చెందిన పట్టుచీరలు, డిజైనర్ చీరలు, ఘాగ్రాస్, సల్వార్లు, డ్రస్ మెటీరీయల్స్, వెస్ట్రన్ వేర్ మరియు పురుషులు మరియు పిల్లల కోసం అందిస్తున్న సంపూర్ణ వస్త్రశ్రేణి కస్టమర్లను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తాయి.
పోలీస్ వేషంలో నిజమైన పోలీసునే మోసం చేయాలనుకున్న స్కామర్.. దూలతీరిపోయింది!