స్టార్ సెలబ్స్ అయిన కూడా రేసింగ్ చేస్తున్న నటీనటులు వీళ్ళే !

కార్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి చాలా మంది కార్ డ్రైవ్ చేయడానికి ఎంతో ఇష్టపడతారు.

అంతేకాదు ఒక అడుగు ముందుకేసి రేసింగ్ చేయాలని కూడా తహతహలాడుతుంటారు.ఇందులో యూత్ ఎక్కువగా కనిపిస్తుంటారు మనకి.

కానీ సాధారణ ప్రజలు కార్ రేసింగ్ లేదా ఫార్ములా వన్ రేసింగ్ లేదంటే బైక్ రేసింగ్.

ఇలా ఏది చేసిన పెద్ద విషయం ఏమి కాదు కానీ స్టార్ హీరోలుగా ఉంటూ కూడా రేసింగ్ పై ఇంట్రెస్ట్ పెంచుకున్న వారిలో మన స్టార్ హీరోస్ అండ్ హీరోయిన్స్ ఉన్నారు అంటే ఆశ్చర్య పడాల్సిందే.

మరి అలా రేసింగ్ ఇంట్రెస్ట్ ఉంటే ఈ రేసర్స్గా మారిన ఆ స్టార్ సెలబ్రిటీస్ ఎవరో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

H3 Class=subheader-styleహీరో అజిత్ కుమార్/h3p హీరో అజిత్ కుమార్ కి మొదటి నుంచి రేసింగ్ అంటే మక్కువ ఎక్కువ.

సినిమా ఇండస్ట్రీలోకి రాక ముందు నుంచి అతను రేసింగ్ లో పాల్గొంటూ వస్తున్నాడు.

ఒకసారి రేసింగ్ లో ప్రమాదం జరిగి దాదాపు చావు అంచుల వరకు వెళ్లి వచ్చాడు.

ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలో బిజీగా మారిపోయాడు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు రేస్ లో పాల్గొంటూ పథకాలు కూడా సాధిస్తుండడం విశేషం.

"""/" / H3 Class=subheader-styleహీరో జై/h3p తమిళ హీరో అజిత్ కుమార్ ని ఆదర్శంగా తీసుకుని జై కూడా రేసింగ్ పై ఇంట్రెస్ట్ పెంచుకున్నాడు జై.

ఇతను కూడా సినిమాల్లో కొనసాగుతూనే మరోవైపు ఫార్ముల వన్ రేసింగ్ లాంటి వాటిల్లో పాల్గొంటూ తన సరదాన్ని తీర్చుకుంటూ ఉంటాడు తనకు అజిత్ అంటే ఆదర్శమని చెప్తాడు జై.

"""/" / H3 Class=subheader-styleనివేదిత పేతురాజ్/h3p మెంటల్ మదిలో అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన నివేదిత అల్లు అర్జున్ అలా వైకుంఠపురం లో కూడా ఒక హీరోయిన్ గా నటించి తెలుగునాట మంచి గుర్తింపును సంపాదించుకుంది.

సినిమాల్లో నటిస్తూనే ఫార్ములా వన్ రేసింగ్ కోర్స్ కూడా పూర్తిచేసి ఇటీవలే సర్టిఫికెట్ కూడా పొందింది నివేదిత తనకు రేసింగ్ అంటే చాలా ఇష్టం అని చెబుతోంది.

"""/" / H3 Class=subheader-styleనాగ చైతన్య/h3p అక్కినేని కుటుంబానికి కార్లు అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే.

అందులో నాగచైతన్యకి మరింత మక్కువ ఎక్కువనే చెప్పాలి.నాగచైతన్య తన సరదా కోసం రేసింగ్ లో పాల్గొంటూ ఉంటాడు అప్పుడప్పుడు.

అలా రేసింగ్ పై ఇంట్రెస్ట్ తో ప్రస్తుతం ఇండియాలోని ఒక రేసింగ్ కంపెనీలో కూడా భాగస్వామి అయ్యాడు.

నాని, విజయ్ దేవరకొండ పాన్ ఇండియాలో తెలుగు సినిమా స్థాయిని పెంచుతారా..?