నిశ్చితార్ధం అయ్యాక పెళ్లి పెటాకులు చేసుకున్న టాలీవుడ్ నటులు వీళ్ళే..!
TeluguStop.com
నిశ్చితార్ధం అంటే పెళ్లి ఖాయం చేసుకోవడం, అది అయ్యిందంటే సగం పెళ్లి అయిపోయినట్టే.
అయితే నిశ్చితార్ధం అయ్యాక కూడా కొన్ని పెళ్లిళ్లు పీటల వరకూ కూడా వెళ్లవు.
ఏవో కారణాల వల్ల ఆగిపోతూ ఉంటాయి.ఈ విషయంలో సినిమా సెలబ్రిటీలు మినహాయింపు కాదు.
వాళ్ళవి అందరిలాంటి జీవితాలే.వాళ్ళ జీవితాల్లోనూ మనస్పర్ధలు, గొడవలు, చికాకులు వంటివి ఉంటాయి.
నిశ్చితార్ధం అయ్యాక పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న సెలబ్రిటీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. """/"/
టాలీవుడ్ సిసింద్రీ అక్కినేని అఖిల్, శ్రియ భూపాల్ ల నిశ్చితార్ధ వేడుక చాలా ఘనంగా జరిగింది.
అక్కినేని, దగ్గుబాటి కుటుంబ పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా ఈ నిశ్చితార్ధ వేడుక జరిగింది.
ఇంకొన్ని రోజుల్లో పెళ్లి కూడా జరుగుతుందనుకుంటే ఊహించని విధంగా షాకిచ్చారు.కారణాలు ఏంటో తెలియదు కానీ ఈ ఇద్దరూ కలిసి ఏడడుగులు నడవలేదు.
ఆ తర్వాత శ్రీయ భూపాల్ మరొకరిని వివాహం వేరే ఇంటి కోడలిగా వెళ్ళిపోయారు.
"""/"/
వెండితెర మీద ఓ వెలుగు వెలిగిన లవర్ బాయ్ ఉదయ్ కిరణ్, చిరంజీవి పెద్దకూతురు సుష్మిత ప్రేమించుకున్న విషయం తెలిసిందే.
కుటుంబ పెద్దల అంగీకారంతో ఒకరికొకరు ఎంగేజ్ మెంట్ రింగ్ లు కూడా మార్చుకున్నారు.
కానీ ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో గాని సుష్మిత, విష్ణు ప్రసాద్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకోగా, ఉదయ్ కిరణ్ విశితని పెళ్లి చేసుకున్నారు.
అయితే పెళ్లయిన రెండేళ్ళకి ఉదయ్ కిరణ్ సూసైడ్ చేసుకున్నారు.ఈ సంఘటనతో టాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది.
"""/"/
తమిళ హీరో విశాల్, అనీషారెడ్డితో గత ఏడాది అక్టోబర్ నెలలో నిశ్చితార్ధం చేసుకున్నారు.
అయితే అనుకోని కారణాల వల్ల జరగాల్సిన పెళ్లి తంతు ఆగిపోయింది.హీరోయిన్ త్రిష, ప్రముఖ బిజినెస్ మేన్ అయిన వరుణ్ మణియన్ తో నిశ్చితార్ధం చేసుకున్నారు.
కానీ పెళ్లి ఆగిపోయింది. """/"/
టాలీవుడ్ క్యూట్ బ్యూటీ రష్మిక మందన్న, కన్నడ హీరో రక్షిత్ శెట్టితో ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు.
కానీ అనుకోకుండా పెళ్లి క్యాన్సిల్ అయ్యింది.కలిసి ఏడడుగులు నడవాల్సిన ఈ ప్రేమ జంట కొన్ని కారణాల వల్ల వెనకడుగు వేశారు.
"""/"/
కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార, శింభుల మధ్య ప్రేమాయణం చాలా కాలం నడిచింది.
ఆ తర్వాత బ్రేకప్ అయ్యింది.ప్రభుదేవాతో కొన్ని రోజులు ప్రేమాయణం సాగించిన నయనతార ఆ తర్వాత తమిళ దర్శకుడు విగ్నేష్ శివన్ తో ప్రేమలో మునిగి తేలారు.
మొదట శింభు, నయనతార ఎంగేజ్ మెంట్ చేసుకుని పెళ్లి ప్రోగ్రామ్ ని క్యాన్సిల్ చేసుకున్నారు.
ఆ ప్రభుదేవాతో కూడా సేమ్ ఇదే రిపీట్ అయ్యింది.ఆల్ రెడీ ప్రభుదేవాకి పెళ్లి అయ్యింది.
అది తెలిసి ఆయన్ని ప్రేమించి పెళ్లాడదామనుకున్నారు నయనతార.నిశ్చితార్ధం కూడా చేసుకున్నారు, కానీ బ్రేకప్ చెప్పేసుకున్నారు.
పోనీ విగ్నేష్ తో అయినా కలిసి ఏడడుగులు నడుస్తారనుకుంటే వెనకడుగు వేశారు.పీకల్లోతు ప్రేమించుకుని, నిశ్చితార్ధం చేసుకుని బ్రేకప్ చెప్పుకున్నారు.
ఇప్పుడు ఎవరికి వారు సింగిల్ గా ఉన్నారు. """/"/
ఇక బొమ్మరిల్లు సిద్దార్థ, సమంతల గురించి చాలా రోజులు ఇద్దరి మధ్య ఏదో నడుస్తుందని కథనాలు వచ్చాయి.
ఇద్దరూ ప్రేమించుకుంటున్నారని, పెళ్లి కూడా చేసుకుంటారని వార్తలు వచ్చాయి.అయితే ఊహించని రీతిలో ఈ ఇద్దరూ విడిపోయారు.
పెళ్లి చేసుకుందామనుకున్న ఈ ఇద్దరూ ఏవో కారణాల వల్ల బ్రేకప్ చెప్పుకున్నారని వార్తలు వచ్చాయి.
అయితే సమంత మాత్రం సిద్దార్ధతో ఉన్నది కేవలం స్నేహం మాత్రమే అని చెప్పుకొచ్చారు.
అది ఎంత వరకూ నిజమో తెలియదు కానీ సమంత, నాగచైతన్యలు ఏ మాయ చేసావే సినిమా అప్పటి నుండి ప్రేమలో మునిగితేలుతున్నారని పెళ్లి అయ్యాక బహిరంగంగా చెప్పుకొచ్చారు.
మెంతులతో ఇలా చేశారంటే మీ ముఖంపై ఒక్క మచ్చ కూడా ఉండదు.. తెలుసా?