టాలీవుడ్ కు పూర్వవైభవం రావాలంటే కనీసం రెండు హిట్లయినా పడాల్సిందేనా?
TeluguStop.com
2022 ఏడాది వచ్చి అప్పుడే ఏడు నెలలు అవుతుంది.సగానికి పైగానే అయిపోయిన కూడా చెప్పుకోదగ్గ సూపర్ హిట్ సినిమాలను వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు.
గత రెండేళ్లుగా కరోనా కారణంగా సినిమా ఇండస్ట్రీ కుదేలైంది.అయితే ఈ కొత్త ఏడాదిలో టాలీవుడ్ కాస్త ఊపిరి పీల్చుకుంది అనుకునే లోపే మళ్ళీ ప్లాప్స్ ఎదురవుతున్నాయి.
వరుసగా సినిమాలు రిలీజ్ అవుతున్న కూడా సక్సెస్ రేట్ మాత్రం లోగా ఉంది.
మనం ఖచ్చితంగా చెప్పుకోదగ్గ సినిమాలు బంగార్రాజు, డీజే టిల్లు, ట్రిపుల్ ఆర్ సినిమాలు మాత్రమే బ్రేక్ ఈవెన్ అయ్యి బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచాయి.
ఇక ఆ తర్వాత మే నెలలో వచ్చిన సర్కారు వారి పాట విజయం సాధించింది.
ఎఫ్ 3 యావరేజ్ గానే మిగిలి పోయింది.జూన్ లో వచ్చిన మేజర్ సినిమా రియల్ హిట్ గా నిలవగా.
జులై నెలలో మాత్రం చెప్పుకోదగ్గ హిట్స్ అయితే ఇప్పటి వరకు రాలేదు.ఈ నెల పూర్తి కావొస్తున్నా బాక్సాఫీస్ ను ఉత్సాహపరిచేలా ఒక్క హిట్ కూడా రాలేదు.
ఇలా నాలుగు ఐదు సినిమాలు తప్ప బాక్సాఫీస్ హిట్స్ గా మరిన్ని సినిమాలు నిలవలేక పోయాయి.
మరి తెలుగు బాక్సాఫీస్ మళ్ళీ పుంజుకోవాలి అంటే కనీసం రెండు మంచి హిట్స్ పడాల్సిందే.
ఇక జులై చివరి మొదలుకుని ఆగష్టు మొత్తం వరుస సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.
"""/"/
ఓటిటి వల్ల, టికెట్ అధిక రేట్ వల్ల ప్రేక్షకులు సినిమాలు చూడడానికి ఇష్టపడడం లేదు.
అందుకే హిట్ తెచ్చుకున్న కొన్ని సినిమాలు సైతం కలెక్షన్స్ మాత్రం అందుకోలేక పోతున్నాయి.
మరి ఇప్పుడు రిలీజ్ కాబోయే సినిమాలు అయినా మంచి వసూళ్లు రాబట్టి బాక్సాఫీస్ కు పూర్వపువైభవం తెప్పిస్తాయో లేదో చూడాలి.
"""/"/
ఈ శుక్రవారం రామారావు ఆన్ డ్యూటీ తో వరుస సినిమాల రిలీజ్ లు మొదలు కాబోతున్నాయి.
వచ్చే నెలలో బింబిసార, కార్తికేయ 2, సీతా రామం, మాచర్ల నియోజక వర్గం, లైగర్, రంగరంగ వైభవంగా సినిమాలు థియేటర్ లోకి రానున్నాయి.
మరి వీటిలో ఏ రెండు హిట్ అయినా మరోసారి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళ లాడుతుంది.
నైజాంలో ఆ రికార్డ్ క్రియేట్ చేయనున్న పుష్ప ది రూల్.. బన్నీ క్రేజ్ కు ప్రూఫ్ ఇదే!