ఆ సినిమాలపైనే కోటి ఆశలు పెట్టుకున్న అందాల భామలు ?

ఒక సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది అనే దర్శక నిర్మాతలు తెరకెక్కిస్తారు.కానీ అవి అనుకోకుండా లేదా ఇతర కారణాల వలన ప్లాప్ లు అవుతుంటాయి.

అయితే ఇలా సినిమాలు ప్లాప్ లు అయితే చాలా జీవితాలు తారుమారు అవుతుంటాయి.

సక్సెస్ అయితే మాత్రం వరుస అవకాశాలు రెమ్యూనరేషన్ లు పెరగడం గిఫ్ట్ లు ఇలా హీరో హీరోయిన్ లకు పండగే.

అదే సినిమాలు ఫ్లాప్ లు అయితే హీరోలనే కాదు హీరోయిన్ ల కెరియర్ ని కూడా ప్రభావితం చేస్తాయి అన్నది తెలిసిందే.

వరుస ఫ్లాప్ లు చుట్టుముడితే ఇక ఆ హీరోయిన్ కి ఆటోమేటిక్ గా అవకాశాలు తగ్గుతాయి.

ఎంత స్టార్ హీరోయిన్ అయినా వరుస పరాజయాలు వెంటపడితే పెద్ద హీరోలు తమ చిత్రాల్లో ఛాన్స్ లు ఇవ్వడం కష్టమే.

అలాంటప్పుడు ఒక్క ఛాన్స్ అన్నట్లుగా కనీసం ఒక్క హిట్ అయినా అందుకుంటే మళ్ళీ కెరియర్ ఊపందుకునే అవకాశం ఉంది.

అలాంటి హిట్ కోసమే వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు కొందరు టాలీవుడ్ హీరోయిన్లు.

అందాల తార కీర్తి సురేష్ ఈ మధ్య వరుస ఫ్లాప్ లతో బాగా నిరాశ పడ్డారు.

మహానటి (2018) వంటి బ్లాక్ బస్టర్ తరవాత చేసిన సినిమాలేవీ ఆ స్థాయిలో కీర్తికి గుర్తింపు తీసుకురాలేదు.

దాంతో అమ్మడు తన ఆశలన్నీ మహేష్ పైనే పెట్టుకుంది.అదేనండి తాజాగా మహేష్ నటించిన చిత్రం సర్కారు వారి పాట లో కీర్తి హీరోయిన్ గా చేశారు.

కాగా ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుని తన కెరియర్ లో మళ్ళీ ఫుల్ జోష్ తీసుకు రావాలని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది ఈ మహానటి.

"""/"/ `వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్` (2020) సినిమాతో తన క్రేజ్ వేరే లెవల్ కు చేరుతుందని ఆశించిన కేథ‌రిన్ కు ఈ మూవీ డిజాస్ట‌ర్ కావ‌డంతో అంతా రివర్స్ అయ్యింది .

అయితే ఇపుడు ఆమె నటించిన తాజా చిత్రం "భ‌ళా తంద‌నాన‌" పైనే తన ఆశలన్నిటిని పెట్టుకుంది.

ఈ చిత్రం ఈ నెల 6న విడుద‌ల‌ కానున్న విషయం తెలిసిందే.ఈ సినిమా లో శ్రీ విష్ణు హీరోగా నటించారు.

"""/"/ ఇక మిల్క్ బ్యూటీ తమన్నా, యంగ్ హీరోయిన్ మెహ్రిన్, పూజ హెగ్డే, సోనాల్ చౌహాన్ ఈ నలుగురు హీరోయిన్ లు ఒకే సినిమా పైనే తమ ఆశలన్నిటిని కూడగట్టుకు కూర్చున్నారు.

ఈ నలుగురు నటించిన తాజా చిత్రం F3 .ఈ సినిమాలో తమన్నా, మెహ్రిన్ లు మెయిన్ హీరోయిన్ లుగా చేయగా పూజ హెగ్డే ప్రత్యేక గీతం చేసింది.

సోనాలి చౌహాన్ అతిధి పాత్రలో కనిపించనుంది. """/"/ పూజ హెగ్డే ఇప్పటికే హ్యాట్రిక్ ఫ్లాప్ లను అకౌంట్ లో వేసుకుని ఆశగా ఈ సినిమా వైపు చూస్తుండగా, మాస్ట్రో నిరాశలో తమన్నా, అశ్వద్ధామ, మంచి రోజులు వచ్చాయి ఫ్లాప్ లతో మెహ్రిన్ లు కూడా F3 పై భారీగా ఆశలు పెట్టుకోగా.

బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా అందుకునే రిజల్ట్ తో ఈ భామలకు ఎలాంటి ఫలితం దక్కుతుందో చూడాలి.

కాగా ఈ సినిమాను ప్రముఖ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించారు.

కాలేజీ కూడా కంప్లీట్ చేయని మహిళ ప్రతినెలా రూ.15 లక్షలు సంపాదిస్తోంది.. ఎలాగంటే..?