చాలా ఏళ్ల గ్యాప్ తీసుకుని తిరిగి కలిసి నటించిన హీరో హీరోయిన్స్ వీరే !
TeluguStop.com
సినిమా ఇండస్ట్రీలో కాంబినేషన్స్ సెట్ అవ్వడానికి టైం పడుతుందేమో కానీ ఒక్కసారి సెట్ అయ్యాక మళ్ళీ చాలా తొందరగా ఆ కాంబినేషన్ పై సినిమా ఇండస్ట్రీలోని మేకర్స్ వర్కౌట్ చేస్తారు.
అందుకే త్వరగా ఆ కాంబినేషన్ లో సినిమాలు వచ్చే అవకాశం ఉంటుంది.అలా రావాలి అంటే ఖచ్చితంగా వారి ఫస్ట్ కాంబినేషన్ హిట్ అయి ఉంటేనే జరుగుతుంది.
కానీ కొన్నిసార్లు హీరో హీరోయిన్స్ హిట్ కాంబినేషన్ లో పనిచేసినప్పటికీ కూడా మరోసారి రిపీట్ చేయాలి అంటే చాలా ఏళ్ల గ్యాప్ తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.
మరి అలా ఒక సినిమా తర్వాత ఎన్నో ఏళ్లపాటు కలసి పని చేయలేకపోయి ఆ తర్వాత సినిమాలు చేసిన వారు ఉన్నారు.
వారెవరో ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.h3 Class=subheader-styleకాజల్ అగర్వాల్, కళ్యాణ్ రామ్/h3p """/" /
కళ్యాణ్ రామ్( Kalyan Ram ) మరియు కాజల్ అగర్వాల్( Kajal Aggarwal ) తొలిసారిగా నటించిన సినిమా లక్ష్మీ కళ్యాణం.
ఈ సినిమానే కాజల్ కి తెలుగులో తొలి చిత్రం కావడం విశేషం.ఈ సినిమాలో నటించిన వీరిద్దరు 11 ఏళ్ల తర్వాత ఎమ్మెల్యే అనే మరో చిత్రంతో కలిసి పని చేశారు.
H3 Class=subheader-styleతమన్నా మరియు కార్తీ/h3p """/" /
అవార సినిమాలో కలిసి మొట్టమొదటిసారి నటించిన తమన్నా( Tamanna ) మరియు కార్తీ( Karthi ) మరోసారి తిరిగి కలిసి నటించడానికి ఆరేళ్ల సమయం పట్టింది.
ఇంత గ్యాప్ తర్వాత వీరిద్దరూ కలిసి నటించిన సినిమా ఊపిరి.ఈ చిత్రం అప్పట్లో మంచి అప్లాజ్ దక్కించుకుంది.
H3 Class=subheader-styleఅనుష్క మరియు మాధవన్/h3p """/" /
అనుష్క( Anushka ) మరియు మాధవన్( Madhavan ) కాంబినేషన్ లో తమిళ్ లో మొదట రెండు అనే సినిమా వచ్చింది.
ఆ తర్వాత దాదాపు 14 ఏళ్ల తర్వాత కలిసి నిశ్శబ్దం అనే చిత్రంలో వీరిద్దరూ నటించారు.
H3 Class=subheader-styleజ్యోతిక మరియు మాధవన్/h3p """/" /
వీరిద్దరూ కలిసి తొలినాల్లలో చాలానే సినిమాలు చేశారు అయితే దాదాపు 20 ఏళ్ల గ్యాప్ తీసుకొని సైతాన్ అనే సినిమాతో మరోమారు ఈ జంట వెండితెరపై సందడి చేసింది.
వీడియో వైరల్.. అక్కడ భోజనం వండిన గౌతమ్ అదానీ