సినిమాల్లో అమ్మగా నటించారు.. కానీ నిజజీవితంలో అమ్మ కాలేకపోయిన నటీమణులు వీళ్లే?
TeluguStop.com
తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పటి వరకు అమ్మ పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న నటీమణులు ఎంతోమంది ఉన్నారు.
వీరిలో చాలామంది ఇక అమ్మ పాత్రలకు వారు తప్ప ఇంకెవ్వరు సెట్ కాలేరు అనేంతగా ఒదిగిపోయి నటించిన వారు ఉన్నారు.
అమ్మ ప్రేమ ఎంత గొప్పగా ఉంటుందో తమ పాత్రల్లో ప్రాణం పోసి చూపించిన వారు ఉన్నారు.
అయితే ఇలా అమ్మ పాత్రలోనటించి మెప్పించినవారిలో ఎంతోమంది ఇక అమ్మతనానికి మాత్రం నోచుకోని వారు ఉన్నారు.
అలాంటివారు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.సూర్యకాంతం.
ఎన్టీఆర్ ఏఎన్నార్ కాలంలో అమ్మ పాత్ర అని చెప్పగానే అందరికీ గుర్తుకు వచ్చేది సూర్యకాంతం.
కొన్ని సినిమాల్లో కోడలని రాచిరంపాన పెట్టే అత్తగా మరికొన్ని సినిమాల్లో కొడుకుని ఎంతో ప్రేమగా చూసుకునే అమ్మగా ఇలా ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది.
అప్పట్లో అమ్మ అనే మాట ఎక్కడ వినిపించిన అందరికీ సూర్యకాంతం గుర్తుకు వచ్చేది.
కానీ సూర్యకాంతం కి నిజజీవితంలో పిల్లలు లేరట.అందుకే ఇక షూటింగ్లో ఉన్న వాళ్లనే సొంత బిడ్డల్లా చూసుకునే వారట ఆమె.
ఇక చిరంజీవి కృష్ణా తరంలో అమ్మ పాత్రలు చేసిన నిర్మలమ్మ ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.
"""/"/
అయితే ఆమె కూడా అమ్మతనానికి నోచుకోలేదట.సినిమాలో అమ్మ పాత్రలో నటించిన నిర్మలమ్మ కు నిజజీవితంలో మాత్రం పిల్లలు లేరట.
ఇక ఆ తర్వాత టాలీవుడ్ లో అమ్మ పాత్రలకు కేరాఫ్ అడ్రస్గా మారిన నటి అన్నపూర్ణమ్మ ఒకప్పుడు హీరోయిన్ గా ఆ తర్వాత అమ్మగా అన్ని పాత్రలో కూడా మెప్పించింది ఈమె.
అయితే అటు నటి అన్నపూర్ణమ్మకి కూడా పిల్లలు లేరట.ఇక నేటి తరంలో ఎంతోమంది స్టార్ హీరోలకు అమ్మ పాత్రల్లో నటించి మెప్పించింది రమాప్రభ.
"""/"/ కేవలం అమ్మ పాత్రల్లోనే కాదు కమెడియన్గా కూడా ప్రేక్షకులను అలరించింది.
అయితే ఇలా అమ్మ పాత్రలో నటించిన రమాప్రభ కు నిజ జీవితంలో మాత్రం పిల్లలు పుట్టలేదట.
ఇక ప్రస్తుతం శరత్ కుమార్ తో విడిపోయి ఒంటరిగా నే జీవిస్తుంది రమప్రభ .
ప్రస్తుతం అవకాశాలు తగ్గిపోవడంతో చిన్నా చితకా క్యారెక్టర్ లలో మాత్రమే నటిస్తోంది.
ఒకటి రెండు ప్లాప్ లు వచ్చిన రామ్ చరణ్ కి ఇబ్బంది లేదా..?