అయ్యో మన సహజనటి ఏంటి ఇలా మారిపోయింది..గుర్తు పట్టగలరా..?
TeluguStop.com
ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీ లో హీరోలకు ఎంత క్రేజ్ ఉండేదో హీరోయిన్లకు కూడా అంతే క్రేజ్ ఉండేది.
అప్పుడు వచ్చిన సినిమాల్లో హీరో పాత్రకు ధీటుగా హీరోయిన్ పాత్రలు ఉండేవి ఉదాహరణకి సినిమాలో హీరో పోలీస్ అయితే హీరోయిన్ లాయర్ అయ్యుండేది అలాంటి ఇంపార్టెంట్ రోల్ లో హీరోయిన్స్ నటిస్తూ ఉండేవారు.
అప్పుడు హీరోయిన్ గా మంచి గుర్తింపు సాధించిన వారిలో సావిత్రి గారు, జమున, వాణిశ్రీ, జయప్రద, జయసుధ, శ్రీదేవి లాంటివారు ఉన్నారు.
వీళ్ళందరూ టాప్ హీరోయిన్స్ అయినప్పటికీ అందులో జయసుధ గారు అందరి హీరోల పక్కన నటించి మంచి పేరు సంపాదించుకున్నారు.
జయసుధ గారికి మగాళ్ళలో ఆడవాళ్ళలో చాలామంది ఫ్యాన్స్ ఉండేవారు.అడవి రాముడు సినిమాలో ఎన్టీఆర్ పక్కన ఒక మంచి ఇంపార్టెంట్ పాత్రలో నటించి తనదైన గుర్తింపును సాధించింది.
ఒకప్పుడు చాలా అందంగా ఉండి తన అభినయంతో కుర్రకారు గుండెల్లో కలల రాకుమారిగా మారిపోయింది జయసుధ.
చాలా మంది హీరోల పక్కన తనదైన నటనతో నటించి మెప్పించింది రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన జ్యోతి సినిమాలో తనదైన నటనతో ఆకట్టుకుంది.
ఆమె నటనను నచ్చిన సినీ జనాలు ఆమెకి సహజనటి అనే బిరుదు కూడా ఇచ్చారు.
హీరోయిన్ గా అవకాశాలు తగ్గిపోయిన తర్వాత ఆవిడ అమ్మ పాత్రలు చేయడం స్టార్ట్ చేశారు అలా ఆవిడ చేసిన పాత్రల్లో రవితేజ హీరోగా పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో వచ్చిన అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి సినిమాలో ఆమె నటన చాలా అద్భుతంగా ఉంటుంది.
ఆ తర్వాత చాలా సినిమాల్లో ఆమె హీరోలకు తల్లి పాత్రలు చేశారు.ముఖ్యంగా దిల్ రాజు బ్యానర్ లో భాస్కర్ డైరెక్షన్లో వచ్చిన బొమ్మరిల్లు సినిమా లో సిద్ధార్థ తల్లిగా నటించి మంచి మార్కులు కొట్టేశారు.
"""/"/
అలాగే శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ లో వచ్చిన కొత్త బంగారులోకం సినిమాలో తండ్రిని కోల్పోయిన కొడుకుకి ధైర్యం ఇచ్చే తల్లిగా ఒక మెచ్యూర్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది.
అలాగే కృష్ణవంశీ డైరెక్షన్ లో రామ్ చరణ్ హీరోగా వచ్చిన గోవిందుడు అందరివాడేలే సినిమా లో రాంచరణ్ వాళ్ళ నానమ్మ గా నటించి మంచి పేరు సంపాదించింది.
అయితే అన్ని పాత్రలను అవలీలగా పోషించే జయసుధ ప్రస్తుతం వైట్ హెయిర్ తో ముడతలు పట్టిన ముఖంతో ఉండటం వల్ల జనాలు ఆవిడని చూడలేకుండా ఉన్నారని చెప్పొచ్చు.
"""/"/
ఇదంతా ఏంటి ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా అయితే ఒకప్పుడు శోభన్ బాబు జయసుధ హీరో హీరోయిన్లుగా వచ్చిన సినిమా రాజ్ కుమార్.
దీంట్లో జానకి కలగనలేదు రాముడి సతి కాగలనని ఒక సాంగ్ ఉంది అది మనందరికీ బాగా తెలిసిన పాట.
అయితే ఆ సాంగ్ లో ఉన్న లైన్స్ ని తీసుకొని టైటిల్ గా పెట్టి త్వరలో ఒక సీరియల్ రాబోతుంది దానికి ప్రమోషన్ గా ఆ సీరియల్ టీం జయసుధ గారి తో ఒక ప్రమోషనల్ వీడియోని నెట్లోకి వదిలారు.
ఆ వీడియోలో ఆవిడ వైట్ హెయిర్ తో, ముడతలు పట్టిన మొహంతో ఉండడాన్ని చూసిన ఆవిడ ఫ్యాన్స్ ఒకప్పుడు హీరోయిన్ గా, ఆ తర్వాత తల్లి పాత్రలు చేసిన జయసుధ గారు ప్రస్తుతం ఇప్పుడు ఇలా ఉన్నారు ఏంటి అని ఆశ్చర్యానికి గురవుతున్నారు.
అయిన సినిమా ఫీల్డ్ లో మొహానికి మేకప్ వేసుకుంటేనే ఆర్టిస్టులు అందంగా కనిపిస్తారు.
అది తీసేస్తే వాళ్ళు కూడా మనలాగే సామాన్య మనుషులా ఉంటారు అనేది మనం గుర్తుంచుకుంటే మంచిది.
ఆ ఘటనలో బన్నీ నిందించాల్సిన అవసరం లేదన్న బోనీ కపూర్.. తప్పు లేదంటూ?