ప్రముఖ నటి హేమ లవ్ స్టోరీ గురించి మీకు తెలుసా.. ఈ నటి భర్త ఎవరంటే?

ఇటీవల బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ( Rave Party ) టాలీవుడ్ లో ఎంతటి సంచలనం సృష్టించిందో మనందరికీ తెలిసిందే.

ఈ రేవ్ పార్టీలో పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు ఉన్నారు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు కూడా వినిపించాయి.

అయితే ఈ రేవ్ పార్టీలో ఎక్కువగా వినిపించిన పేర్లలో హేమ( Hema ) పేరు కూడా ఒకటి.

ఈ పార్టీకి టాలీవుడ్‌ నటి హేమ హాజరైనట్లు బెంగళూరు పోలీసులు ఫోటోను కూడా రిలీజ్‌ చేశారు.

అయితే మొదట తాను పార్టీలో లేనంటూ వీడియో రిలీజ్ చేసినప్పటికీ ఆ తర్వాత హేమకు పాజిటివ్‌గా వచ్చినట్లు పోలీసులు స్పష్టం చేశారు.

దీంతో గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో హేమ పేరు మారుమోగుతోంది. """/" / హేమ విషయానికి వస్తే.

ఆమె తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.కమెడియన్ గా మాత్రమే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సపోర్టింగ్ క్యారెక్టర్ లలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది హేమ.

ముఖ్యంగా క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా వందలకు పైగా సినిమాల్లో నటించింది.విభిన్నమైన పాత్రలతో వెండితెరపై అలరించింది.

ఇటీవల రేవ్ పార్టీలో హేమ పేరు రావడంతో ఆమె గురించి నెట్టింట చర్చ మొదలైంది.

హేమ ఫ్యామిలీకి సంబంధించిన వివరాల గురించి ఆరా తీస్తున్నారు.అయితే హేమ గురించి ఒక ఆసక్తికర విషయం బయటకొచ్చింది.

ఆమె ప్రేమ వివాహం చేసుకుందట.ఇంతకీ హేమ ఎవరిని పెళ్లి చేసుకుంది అతను ఎవరు అన్న వివరాల్లోకి వెళితే.

"""/" / తూర్పుగోదావరి జిల్లా రాజోలుకి చెందిన హేమ అసలు పేరు కృష్ణవేణి.

తెలుగులో 1989లో బాలయ్య బాబు హీరోగా నటించిన భలేదొంగ చిత్రం తో టాలీవుడ్‌కు పరిచయం అయ్యింది.

‍అయితే హేమకి ఫేమ్ తీసుకొచ్చిన చిత్రం క్షణక్షణం.రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హేమ.

శ్రీదేవికి స్నేహితురాలిగా కనిపించారు.ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో హేమకి మంచి గుర్తింపు దక్కింది.

ఆ తర్వాత సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తినే ప్రేమ పెళ్లి చేసుకున్నారు హేమ.

ఆమె భర్త పేరు సయ్యద్ జాన్ అహ్మద్ ( Syed John Ahmed )కాగా.

గతంలో ఓ ఇంటర్య్వూలో తన లవ్ స్టోరీ గురించి నోరువిప్పింది.తాను దూరదర్శన్‌లో పనిచేసే సమయంలో అతను పరిచయమైనట్లు హేమ తెలిపింది.

అక్కడే అతను అసిస్టెంట్ కెమెరా మెన్‌గా పనిచేసేవారని వెల్లడించింది.ఓసారి అతన్ని మొదటిసారి కలిసినప్పుడే పెళ్లి చేసుకుంటానని ప్రపోజ్ చేశాడని, మొదటిసారి కలిసిన వెంటనే పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో కాదనలేకపోయానని హేమ వివరించింది.

కాగా వీరిద్దరికీ ఈషా అనే కూతురు కూడా ఉంది.

షాకింగ్ వీడియో: బల్లిని తరిమికొట్టాలని స్ప్రే తీసుకెళ్లిన అమ్మాయికి ఏకంగా..?