ఒక్క హిట్ తో పత్తా లేకుండా పోయిన ఈ హీరోయిన్ మీకు ఇంకా గుర్తుందా..?

తెలుగులో ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహించిన ఆర్య చిత్రంలో "గీత" పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించిన తెలుగు అమ్మాయి "అనురాధ మెహతా" గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

అయితే అనురాధా మెహతా అంతకు ముందే ప్రముఖ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన "నువ్వంటే నాకిష్టం" అనే చిత్రంలో నటించింది.

 కానీ ఆ చిత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోవడంతో పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేక పోయింది.

కాగా ఆర్య సినిమా విడుదలయిన తర్వాత మంచి హిట్ అయినప్పటికీ ఎందుకో కొత్త సినిమా అవకాశాలు దక్కించుకోవడంలో విఫలం అయింది.

 దీంతో తమిళ, కన్నడ, మలయాళ, భాషలలో కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ అక్కడ కూడా పెద్దగా రాణించలేక పోయింది.

దీంతో పూర్తిగా సినిమా పరిశ్రమకు దూరం అయిపోయింది.ఈ క్రమంలో నటి అనురాధ మెహతా ఎలాంటి సినిమా ఆడియో ఫంక్షన్లకి గాని లేదా సినిమా పరిశ్రమలో జరిగేటువంటి వేడుకలకు గాని ఇప్పటివరకు హాజరు కావడం లేదు.

ఏదేమైనప్పటికీ అందం, అభినయం, మంచి నటనా ప్రతిభ ఉన్నటువంటి తెలుగు అమ్మాయి ఇలా అర్ధాంతరంగా ఒకటి, రెండు సినిమాల్లో నటించే అవకాశాలు లేక సినీ పరిశ్రమలో వదిలిపెట్టి వెళ్లిపోవడాన్ని ప్రేక్షకులు అసలు జీర్ణించుకోలేక పోతున్నారు.

బోస్టన్‌: ఈ ముద్దుగుమ్మను ఎవరైనా కిస్ చేయవచ్చట.. కానీ మూడు రూల్స్!