ఎన్నో సినిమాలు .. ఎంతో డబ్బు .. చివరకు చేతిలో చిల్లిగవ్వ లేక కడుపేదరికంతో...
TeluguStop.com
దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలని అనేది కామన్ మ్యాన్ నుంచి సెలబ్రిటీస్ వరకు అందరికీ వర్తిస్తుంది.
ఇప్పుడు ఈ సామెత ఎందుకంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ నటులుగా గుర్తింపు పొందినా.
బాగా డబ్బు సంపాదించినా.కెరీర్ చివరల్లో సంపద అంతా పోగొట్టుకుని చేతిలో చిల్లిగవ్వ లేకుండా రోడ్డున పడ్డ నటులు ఉన్నారు.
ఇల్లు గడవడమే కష్టంగా మారి సూసైడ్ చేసుకున్న సంఘటనలు ఉన్నాయి.చాలా మంది నటులు ఎంత సంపాదించారో.
అంతకంటే ఎక్కువ పోగొట్టుకున్నారు.జీవిత చరమాంకంలో చాలా కష్టపడ్డారు.
ఇలా బాధలు అనుభవించిన నటులు ఎవరో ఇప్పుడు చూద్దాం.h3 Class=subheader-styleరాజబాబు/h3p """/"/
తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన కామెడియన్.
ఈయన లేకుండా అసలు సినిమాలే రిలీజ్ అయ్యేవి కాదంటే.తనకు ఎంత మేర డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.
కెరీర్ పీక్స్ లో ఉండగా డబ్బులు సంపాదించినా.వాటిని కాపాడుకోలేకపోయారు.
పద్దతి లేకుండా డబ్బులు ఖర్చు చేయడం, అడిగిన వారికి డబ్బులు దానం చేయడం కారణంగా చివరకు ఆస్తులు అమ్ముకునే పరిస్థితి వచ్చింది.
H3 Class=subheader-styleపద్మనాభం/h3p """/"/
ఈయన కూడా చిట్టిబాబు లాగే చాలా సినిమాలు చేశారు.బాగా సంపాదించారు.
ఈయన కూడా అందరికీ డబ్బులు పంచడం, అడిగిన వారికి అడిగినంత ఇవ్వడం వల్ల చివరకు ఓల్డేజ్ హోంలో గడిపే దుస్దితి తలెత్తింది.
H3 Class=subheader-styleరాజనాల/h3p """/"/
ఏఎన్నార్, ఎన్టీఆర్, సావిత్రి కాలంలోఈయన పెద్ద విలన్.విలన్ అంటే రాజనాల, రాజనాల అంటే విలన్ అనేలా బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు.
సినిమాలు చేసి బాగా సంపాదించాడు.ఆయన చివరి రోజుల్లో డబ్బులు లేకుండా అవస్థలు పడ్డారు.
దాసరి నారాయణ తనకు ఆర్థిక సాయం చేసి ఆదుకున్నారు.h3 Class=subheader-styleసావిత్రి/h3p """/"/
తన అసమాన నటనతో సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని ఏలిన నటి సావిత్రి.
తను చూడని డబ్బు లేదు.తను తిరగని కారు లేదు.
ఆమె కట్టని ఇల్లు లేదు.కానీ చివరకు అయిన వాళ్లను నమ్మి మోసపోయింది.
చివరికి ఏ తోడూ లేకుండా ఒంటరిగా కన్నుమూసింది.h3 Class=subheader-styleకాంచన/h3p """/"/
సావిత్రికి ముందు ఈమె స్టార్ హీరోయిన్.
చాలా సినిమాలు చేసి బాగా డబ్బులు సంపాదించింది.సొంత మనుషులను నమ్మి ఉన్నదంటా పోగొట్టుకుంది.
చివరి దశలో చిన్న కాటేజీలో బతికింది.h3 Class=subheader-styleసుధాకర్/h3p """/"/
తెలుగులో స్టార్ కమెడియన్ గా ఎదిగాడు సుధాకర్.
ఎన్నో సినిమాల్లో నటించి బాగా డబ్బులు సంపాదించాడు.కానీ తన డబ్బును నిలుపుకోలేక పోయాడు.
తనకు చిరంజీవి పలుమార్లు ఆర్థికసాయం చేశారు.h3 Class=subheader-styleఐరన్ లెగ్ శాస్త్రి/h3p """/"/
ఒకప్పుడు ప్రతి సినిమాలో తను ఉండేది, తనతో సినిమాల్లో నటించేలా చేసేందుకు నిర్మాతలు ఎక్కువ డబ్బులు ఇచ్చేది.
కానీ చివరకు డబ్బులు లేక అవస్థలు పడుతూ చనిపోయాడు.అంత్యక్రియలకు కూడా డబ్బులు లేవంటే ఆయన పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
H3 Class=subheader-styleఉదయ్ కిరణ్/h3p """/"/
అతి చిన్న వయసులో అద్భుత సినిమాలు చేసిన ఉదయ్ కిరణ్.
డబ్బులు లేక ఏం చేయాలో తోచక ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ ముగ్గురు దర్శకుల సినిమాలు అందుకే ప్రత్యేకంగా నిలుస్తున్నాయా..?