50 ఏళ్ళ వయసులో పిల్లలను కంటున్నా టాలీవుడ్ సెలబ్రిటీస్ ఎవరో తెలుసా..?
TeluguStop.com
సినిమా ఇండస్ట్రీలో హీరోలు ఒకటి రెండు పెళ్లిళ్లు చేసుకుంటుంటారు.అలా పెళ్లి చేసుకున్న వాళ్లు చాలామందే ఉన్నారు.
అయితే తెలుగు లో నాగార్జున కూడా రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు.వాళ్ళల్లో మొదటగా రామానాయుడు కూతురు అయిన లక్ష్మి ని పెళ్లి చేసుకొని తర్వాత డివోర్స్ తీసుకొని అమలని పెళ్లిచేసుకున్నారు.
అలాగే పవన్ కళ్యాణ్ కూడా పెళ్లిళ్లు చేసుకున్నారు కానీ పవన్ కళ్యాణ్ రెండు పెళ్లిళ్లు కాదు ఏకంగా 3 పెళ్లిళ్లు చేసుకున్నారు.
మొదటగా 1997 లో నందిని గారిని పెళ్లి చేసుకున్నారు వారిద్దరి మధ్య గొడవలు జరగడం తో విడిపోయి మళ్లి బద్రి మూవీలో హీరోయిన్ గా పరిచయం అయిన రేణుదేశాయి గారిని పెళ్లి చేసుకున్నారు ఆమెకి కూడా 2012 లో విడాకులు ఇచ్చి 2013 లో తీన్మార్ మూవీలో హీరోయిన్ అయిన అన్న లేజేహనేవ గారిని పెళ్లి చేసుకున్నారు అయితే పెళ్లిళ్లతో వచ్చిన ప్రాబ్లమ్ ఏంలేదు.
కానీ మన హీరోలు 50 సంవత్సరాలకి చేరువ అవుతు ఇప్పుడు పిల్లల్ని కంటున్నారు.
పవన్ కళ్యాణ్ రేణుదేశాయి కి పుట్టిన అఖీరా నందన్, ఆధ్యలు కాగా పవన్ కళ్యాణ్ అన్నాలెజ్నేవా కి కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు.
వీళ్ళకి 2013 లో పెళ్ళికాగా మొదటగా వీళ్ళకి ఒక పాపా పుట్టింది.ఆపాప పేరు పోలేన అంజనా పావనోవా కాగా 2017 లో ఒక బాబు పుట్టాడు.
అయన పేరు మార్క్ శంకర్ పావనోవిచ్ అయితే ఇప్పుడు ఈ బాబు ఏజ్ 4 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ ఏజ్ 49 సంవత్సరాలు.
"""/"/
పవన్ కళ్యాణ్ పరిస్థితి ఇలా ఉంటె విలక్షణ నటుడు అయిన ప్రకాష్ రాజ్ గారు కూడా ఈ కోవలోకే చెందుతారు.
ప్రకాష్ రాజ్ ఎంత గొప్ప నటుడో చెప్పాల్సిన పనిలేదు ఆయన సినిమా జీవితం లో చాలా పాత్రలు చేసి మెప్పించారు.
ఆయన నటనకు గాను నేషనల్ అవార్డు కూడా వచ్చింది.అలాంటి నటుడు కూడా నిజ జీవితం లో రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు.
మొదటగా లలిత కుమారి గారిని పెళ్లి చేసుకున్నారు.వీళ్ళకి ఇద్దరమ్మాయిలు ఒక అబ్బాయి కూడా ఉన్నాడు.
అయితే 2004 సంవత్సరంలో వాళ్ళ అబ్బాయి చనిపోయాడు దాని తరవాత లలిత కుమారికి ప్రకాష్ రాజ్ గారికి గొడవలు జరగడం తో ఇద్దరు విడిపోయారు.
తర్వాత ప్రకాష్ రాజ్ 2010 లో ప్రముఖ కొరియోగ్రాఫర్ అయిన పోనీ వర్మ గారిని పెళ్లి చేసుకున్నాడు.
వీళ్ళకి 5 సంవత్సరాల బాబు కూడా ఉన్నాడు ఇప్పుడు ప్రకాష్ రాజ్ ఏజ్ 55 సంవత్సరాలు వీళ్ళనేకాదు.
చాలామంది ఆర్టిస్టులు 50 సంవత్సరాలకి దగ్గర్లో ఉండి పిల్లలని కంటున్నారు.వాళ్లెవరో తెలుసుకుందాం.
"""/"/
శరత్ కుమార్ గారి గురించి అందరికి తెలుసు ఆయన తెలుగు లో కూడా చాలా సినిమాలు చేసారు.
రీసెంట్ గా జయ జానకి నాయక సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తండ్రిగా మంచి క్యారెక్టర్ చేసాడు.
శరత్ కుమార్ 1984 లో ఛాయా అనే అమ్మాయి ని పెళ్లి చేసుకున్నారు వాళ్ళకి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు ఒకరు వరలక్ష్మి శరత్ కుమార్ కాగా ఇంకొకరు పూజ.
శరత్ కుమార్ కి ఛాయా గారికి తర్వాత కొన్ని గొడవలు జరగడం తో ఇద్దరు విడిపోయారు అయితే వరలక్ష్మి శరత్ కుమార్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఎందుకంటే ఆవిడ ఈ మధ్య రిలీజ్ అయినా క్రాక్ మూవీలో ఒక మంచి విలన్ క్యారెక్టర్ చేసి అందరిని మెప్పించారు.
అయితే శరత్ కుమార్ రాధికా ఇద్దరు 2001 లో పెళ్లి చేసుకున్నారు, వీళ్ళకి ఒక కొడుకు కూడా ఉన్నాడు అయన పేరు రాహుల్ శరత్ కుమార్ ఇప్పుడు ఈయన ఏజ్ 16 సంవత్సరాలు.
శరత్ కుమార్ ఏజ్ 66 సంవత్సరాలు అంటే శరత్ కుమార్ కి 50 సంవత్సరాలు ఉన్నపుడు రాహుల్ పుట్టాడు.
అలాగే అప్పటి హీరోయిన్ అయినా ఊర్వశి గారికి కూడా చిన్నపిల్లలు ఉన్నారు.ఖైదీ సినిమాలో హీరోయిన్ అయిన మాధవి గారికి కూడా లేట్ వయసులోనే పిల్లలు పుట్టారు.
శిల్పాశెట్టి కి కూడా లేట్ వయసులో పెళ్లి అయింది పిల్లలు ఉన్నారు.ఇలా ఇంకా చాలా మంది ఉన్నారు అయితే మనం ముఖ్యంగా చెప్పేది ఏంటి అంటే వీళ్ళకి లేట్ వయసులో పిల్లలు ఎందుకు ఉంటున్నారు అంటే కొందరు సెకండ్ మ్యారేజ్ చేసుకోగా ఇంకొందరు మాత్రం పెళ్లి చేసుకుంటే సినిమా కెరీర్ అక్కడ నాశనం అవుతుందోనని భయంతో లేట్ గా పెళ్లి చేసుకుంటున్నారు.
ఇలా ఎక్కువగా హీరోయిన్స్ చేస్తున్నారు.అందువల్లే వాళ్లు లేట్ ఏజ్ లో పిల్లల్ని కంటున్నారు.
చూద్దాం ఇంకా ముందుముందు ఎంతమంది హీరోలు హీరోయిన్స్ లేట్ గా పిల్లల్నికంటారో చూద్దాం.
బన్నీ కారణంగా ఇండస్ట్రీ మొత్తం తలవంచింది.. ఫైర్ అయిన తమ్మారెడ్డి?