యాంకర్ సుమ వల్ల ఈ ఇద్దరు హీరోస్ జైలు పాలయ్యారంటే నమ్ముతారా ..?

యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఎందుకంటే కొన్ని సంవత్సరాల పాటు టెలివిజన్ తెరపై దూసుకుపోతున్న లేడీ యాంకర్ ఎవరైనా ఉన్నారు అంటే ఆవిడ సుమనే, ఎంత మంది కొత్త యాంకర్ వచ్చినప్పటికీ కొన్ని దశాబ్దాల పాటు సుమనే టెలివిజన్ రంగాన్ని ఏకచ్ఛత్రాధిపత్యం తో ఏలుతుంది.

ఆమె యాంకరింగ్ కి ఫిదా కాని జనాలు ఉండరు.అయితే మొదట్లో కొన్ని సీరియల్స్ లో నటించినప్పటికీ తర్వాత కొన్ని సినిమాల్లో కూడా నటించింది అవి పెద్దగా సక్సెస్ కాకపోవడంతో యాంకరింగ్ రంగంలో స్థిరపడిపోయింది.

టాక్ షో దగ్గర్నుంచి గేమ్ షో దాకా ఇంటర్వ్యూస్ దగ్గర్నుంచి ఆడియో ఫంక్షన్ దాకా ఏ షో చేయాలన్న అది సుమా గారే చేయాలి అనేంతగా జనాలు అలవాటు పడిపోయారు.

సుమ భర్త రాజీవ్ కనకాల గురించి మనకు బాగా తెలుసు మొదట్లో ఆయన రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన శాంతినివాసం సీరియల్ లో నటించి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఆ తర్వాత నిదానంగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఇక్కడ కూడా ఒక మంచి నటుడిగా గుర్తింపు పొందాడు కొన్ని సినిమాల్లో హీరోగా కూడా చేశాడు అవి పెద్దగా సక్సెస్ కాకపోవడంతో మళ్లీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగులో స్థిరపడిపోయారు.

రాజమౌళి లాంటి దర్శకుడు రాజీవ్ కి మంచి ఫ్రెండ్ కావడంతో ఆయన తీసే ప్రతి సినిమా లో రాజీవ్ తో ఒక క్యారెక్టర్ చేయిస్తాడు.

రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన సై సినిమా లో రగ్బి కోచ్ గా ఒక మంచి క్యారెక్టర్ లో రాజీవ్ జీవించాడని చెప్పొచ్చు.

అయితే యాంకరింగ్ లో బిజీగా ఉన్న సుమ టెలివిజన్లో డబ్బింగ్ సీరియల్స్ హవా ఎక్కువైపోయింది అని దాని ద్వారా ఇక్కడ సీరియల్స్ లో నటించే ఆర్టిస్టులకు వర్కర్లకు పని లేకుండా పోతుందని మా టీవీ వాళ్ళు ఎక్కువగా డబ్బింగ్ సీరియల్స్ ను ఎంకరేజ్ చేస్తున్నారని తెలిసి మా టీవీ వాళ్లకు చెప్పిన, యజమాన్యం పట్టించుకోకపోవడంతో సీరియల్స్ లో వర్క్ చేసే ఆల్ డిపార్ట్మెంట్స్ టెక్నీషియన్స్ అందరూ స్ట్రైక్ చేశారు.

"""/"/ కానీ మా టివి వారు ఆ స్ట్రైక్ నీ ఏ మాత్రం పట్టించుకోకుండా వాళ్ళ ప్రోగ్రామ్స్ నీ వాళ్ళు కంటిన్యూ చేసుకుంటూ వెళ్లి పోయారు దీంతో విసిగిపోయిన ఆర్టిస్టులు మాటీవీ ఆఫీస్ మీద రాళ్లు వేశారు.

సుమ మాటీవీలో చేస్తున్న భలే చాన్సులే ప్రోగ్రాం షూటింగ్ కి నువ్వు వెళ్ళకూడదు అని చెప్తే వినకుండా వెళ్ళింది షూటింగ్ నీ ఆపడానికి సీరియల్ ఆర్టిస్ట్ అయిన కౌశిక్, శ్రీ రామ్, ప్రభాకర్ లాంటి వాళ్ళు వెళ్తే అక్కడ పోలీసులు వారిని అరెస్టు చేసి చంచల్ గూడా జైలుకు తరలించారు.

దీనికంతటికీ కారణం సుమనే ఎందుకంటే ప్రోగ్రాం ఆపడానికి నేను వస్తున్న మన ఫోన్ చేసినప్పుడు బయట పోలీసులు ఉన్నారని చెప్పొచ్చుగా చెప్పలేదు, షో ఒకరోజు పోయేదేముంది అని చెప్పలేదు అని టీవీ ఆర్టిస్ట్ లు అందరూ కలిసి ధర్నా చౌక్ దగ్గర ధర్నా చేస్తూ సుమ ఇక్కడికి వచ్చి మాకు సారీ చెప్పాలి అని వాళ్లు డిమాండ్ చేశారు.

సుమ ఈ గొడవతో నాకు ఏ సంబంధం లేదని నేను ఎందుకు సారీ చెప్పను అని తను కూడా మొండిగా ప్రవర్తించారు.

మొత్తానికి కొంతమంది పెద్దల జోక్యంతో సుమ వచ్చి తను ఎందుకు షూటింగ్ ఆపలేదు వివరణ ఇచ్చుకోవడం తో ఆ గొడవ అక్కడితో సద్దుమణిగింది.

తర్వాత ఎవరు షూటింగ్ లో వాళ్ళు బిజీ అయిపోయి ఎవరి పనులు వాళ్లు చేసుకుంటున్నారు కానీ ఇప్పటికి కూడా టెలివిజన్ రంగంపై సుమ తన యాంకరింగ్ తో చెరిగిపోని ముద్ర వేశారు అని చెప్పొచ్చు.

టెలివిజన్ ఉన్నంతకాలం సుమ పేరు టెలివిజన్ రంగంపై సువర్ణాక్షరాలతో లిఖించపడుతుంది అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు ఎందుకంటే తను చేసే ప్రోగ్రామ్స్ తనకి ఆ గుర్తింపుని తీసుకొచ్చాయి.

/p.

నేడు ఏపీలో కేంద్రమంత్రుల పర్యటన .. కారణం ఏంటంటే ?