ఈ ఫోటోలో కనిపిస్తున్న నటి టాలీవుడ్ విలన్ భార్య అని మీకు తెలుసా..?
TeluguStop.com
తెలుగులో ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ దర్శకత్వం వహించిన "బద్రీనాథ్" చిత్రంలో "నేనెవరినో తెలుసా ఈ రాష్ట్రాన్ని శాసించే సర్కార్ భార్యని, నీకు మేనత్తని, ఒకసారి నీ నోటి నుంచి అత్తా అని పిలువు.
" అంటూ డైలాగ్ చెప్పే నటి అశ్విని కలేస్కర్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.
అయితే ఈమె ఇప్పటి వరకు పలు తెలుగు చిత్రాలలో విలన్ గా మరియు సెంటిమెంటల్ ఓరియెంటెడ్ పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.
అయితే ఇప్పుడు ఆమె గురించి పలు ఆసక్తికర అంశాలను తెలుసుకుందాం.అశ్విని కలేస్కర్ మహారాష్ట్రలోని ముంబైలో జన్మించింది.
చిన్నప్పటి నుంచే ఆమెకు నటన పట్ల ఆసక్తి ఉండటంతో ఆమె తల్లిదండ్రులు నటనలో శిక్షణ ఇప్పించారు.
దీంతో మొదటగా అశ్విని కలేస్కర్ గా నటిగా హిందీ ధారావాహికలలో నటించి బుల్లితెర రంగ ప్రవేశం చేసింది.
ఆ తర్వాత మెల్లగా సినిమాల వైపు ఆసక్తి మళ్లడంతో పలు నెగిటివ్ షేడ్స్ మరియు విలన్ పాత్రలో కూడా నటించింది.
ఈ క్రమంలో అశ్విని కలేస్కర్ టాలీవుడ్ ప్రముఖ నటుడు మురళి శర్మ ని పెళ్లి చేసుకుంది.
ప్రస్తుతం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, తదితర భాషలలో అవకాశాల దక్కించుకుని బాగానే రాణిస్తోంది.
అలాగే దాదాపుగా 12 కి పైగా ధారావాహికలలో నటించి, అటు బుల్లితెర ప్రెకషకులని, ఇటు వెండి తేర ప్రేక్షకులని బాగానే ఆకట్టుకుంటోంది.
అయితే మురళి శర్మ కూడా మొదట్లో విలన్ గా టాలీవుడ్ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ ప్రస్తుతం నెగిటివ్ షేడ్స్ సెంటిమెంటల్ ఇలా ఏదైనా సరే తనదైన శైలిలో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాడు.
ఇటీవలే మురళీ శర్మ టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన "అల వైకుంఠపురములో" అనే చిత్రంలో నటించి సినీ విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు అందుకున్నాడు.
స్విగ్గి చేసిన ప్రకటనపై మండిపడుతున్న దుకాణదారులు