గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష సందేహాల నివృత్తికి టోల్ ఫ్రీ నెంబర్:కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి
TeluguStop.com
నల్లగొండ జిల్లా:జిల్లాలో\ఈ నెల 11 వ తేదీన నిర్వహించనున్న గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు( Group 1 Preliminary ) సంబంధించి సందేహాల నివృత్తికి టోల్ ఫ్రీ నెంబర్ 18004251442 కేటాయించి హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ టి.
వినయ్ కృష్ణారెడ్డి ( Vinay Krishna Reddy )సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
జిల్లా కేంద్రంలో 51 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు,జిల్లాలో 16095 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారని, ఇందులో 191 మంది ఉర్దూ మీడియం అభ్యర్థులు ఉన్నారని తెలిపారు.
ఈ నెల 11 న గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష ఉదయం 10.
30 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించనున్నట్లు, అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు ఉదయం 8:30 గంటల నుండి 10:15 గంటల వరకు మాత్రమే అనుమతించడం జరుగుతుందని,10:15 గంటలకు గేట్ లు మూసి వేయనున్నట్లు తెలిపారు.
పరీక్షా కేంద్రం గేట్ లు మూసి వేసిన తర్వాత అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతి లేదని స్పష్టం చేశారు.
పరీక్ష కేంద్రాలు,పరీక్షకు సంబంధించి ఎటువంటి సమస్య,సందేహలున్నా టోల్ ఫ్రీ నెంబర్ 18004251442 కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవాలని తెలిపారు.
పరీక్షకు సంబంధించి ఇప్పటికే చీఫ్ సూపరింటెండెంట్ లను, ఇన్విజిలేటర్లను,లైజన్ అధికారులను నియమించినట్లు వెల్లడించారు.
అభ్యర్థులు హాల్ టికెట్ తో పాటు ఒరిజినల్ గుర్తింపు కార్డ్ తీసుకురావాలన్నారు.పరీక్ష కేంద్రంలో ఓఎంఆర్ పత్రాలలో సరిగ్గా బబ్లింగ్ చేయాలని,లేకుంటే ఇన్ వ్యాలిడ్ కింద పరిగణించడం జరుగుతుందన్నారు.
వామ్మో గంగవ్వని చూశారా… ఇలా తయారయ్యిందేంటి… అసలు గుర్తుపట్టలేరుగా?