చర్లపల్లి జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ కు టోకరా

హైదరాబాద్ లో సైబర్ కేటుగాళ్లు అక్రమాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.ఈ క్రమంలోనే తాజాగా చర్లపల్లి జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ కు టోకరా వేశారు.

ఈ నేపథ్యంలోనే బెదిరింపులకు పాల్పడుతూ సుమారు రూ.లక్ష వరకు వసూలు చేసినట్లు సమాచారం.

వ్యక్తిగత వీడియోలు సోషల్ మీడియాలో పెడతామని జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ దశరథంకు బెదిరించారు.

దీంతో పలు దఫాల్లో రూ.లక్ష చెల్లించారు.

అయితే ఇంకా రూ.85 వేలు చెల్లించాలని వేధింపులకు దిగారు.

దీంతో బాధితుడు కుషాయిగూడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

కశ్మీర్‌లో గింగిరాలు తిరిగిన కారు.. వీడియో చూస్తే ఆశ్చర్యపోతారు..