జ‌వాన్‌ను అంటూ పండ్ల వ్యాపారికి టోక‌రా.. ఇది మామూలు సైబ‌ర్ నేరం కాదు

ఇప్ప‌టి కాలంలో మోసాలు ఎంత‌లా పెరిగిపోతున్నాయో అంద‌రం చూస్తూనే ఉన్నాం.ఏ చిన్న అవ‌కాశం దొరికినా స‌రే సైబ‌ర్ నేర‌గాళ్లు అకౌంట్ల‌ను ఖాళీ చేసేస్తున్నారు.

పెరుగుతున్న టెక్నాల‌జీని సైబ‌ర్ నేర‌గాళ్లే అధికంగా వాడేస్తూ లూఠీ చేస్తున్నారు.ఇక మోసాలు చేయ‌డంలో కూడా సరికొత్త పంథాల‌ను వెతుక్కుంటున్నారు.

ఏదో ఒక స్టోరీ చెప్పి ముందుగా న‌మ్మిస్తున్నారు.ఆ త‌ర్వాత వారి మాయ మాట‌ల‌తో అమాయ‌కుల అకౌంట్ల వివ‌రాల‌ను తెలుసుకుని నిండా ముంచేస్తున్నారు.

ఇప్పుడు కూడా ఇలాంటి ఓ నేరం అంద‌రినీ షాక్ కు గురి చేస్తోంది.

అటు పోలీసులు, అధికారులు సైబ‌ర్ నేర‌గాళ్ల మీద ఎంత‌లా అవగాహ‌న క‌ల్పిస్తున్నా స‌రే కొంద‌రు మాత్రం ఈజీగా మాయ మాట‌ల‌కు ప‌డిపోయి చివ‌ర‌కు ఉన్న‌దంతా పోగొట్టుకుంటున్నారు.

ఇప్పుడు కూడా ఓ పండ్ల వ్యాపారి ఇలాగే ఉన్న‌దంతా పోగొట్టుకున్నారు.మహాబుబ్‌నగర్ జిల్లాకు చెందిన కొంద‌రు పండ్ల వ్యాపారుల‌ను టార్గెట్ చేసుకుని తాము జ‌వానులం అని త‌మ‌కు పెద్ద ఎత్తున పండ్లు కావాలంటూ మెసేజ్‌లు పంపించారు.

ఇక దాన్ని ఓ వ్యాపారి హ‌నీఫ్ న‌మ్మి రిప్లై ఇచ్చాడు.వారి నెంబ‌ర్‌కు ఫోన్ చేసి వివ‌రాలు అడ‌గ్గా త‌మ‌కు పెద్ద మొత్తంలో పండ్లు కావాలంటూ న‌మ్మించారు.

"""/" / నిజ‌మే కావ‌చ్చు అని న‌మ్మిన హ‌నీఫ్ అందుకోసం వారు చెప్పింద‌ల్లా చేశాడు.

వారేమో త‌మ ఆఫీసు ఢిల్లీలో ఉంటంద‌ని, నిత్యం వేలాది రూపాయల విలువ చేసే పండ్ల‌ను కొంటామ‌ని, ఇందుకోసం ఓ ఒప్పందం చేసుకోవాల‌ని చెప్పారు.

ఒప్పందంలో భాగంగా ముందు గా రూ.8, 100 ముందుగా హ‌నీఫ్ వారికి పంపాడు.

ఆ త‌ర్వాత కొన్ని ద‌ఫాలుగా రూ.32,000 పంపించాడు.

ఇలా దాదాపు రూ.45 వేలు పంపించాడు.

ఇంత జ‌రిగిన త‌ర్వాత వారు స్పందించ‌క‌పోవ‌డంతో అనుమానం వ‌చ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

దీంతో వారు రంగంలోకి దిగి విచార‌ణ జ‌రుపుతున్నారు.

పార్టీ మారిన నేతలకు బుద్ధి చెప్పాలి..: కేటీఆర్