ఈనాడు గ్రూప్ అధినేత గౌ “శ్రీ చెరుకూరి రామోజీరావు” గారు కన్నుమూత..

ఈనాడు గ్రూప్ అధినేత గౌ “శ్రీ చెరుకూరి రామోజీరావు” గారు కన్నుమూత

ఈనాడు గ్రూప్స్ అధినేత మీడియా మొఘల్ రామోజీరావు ( Mughal Ramoji Rao )మరణించారు.

ఈనాడు గ్రూప్ అధినేత గౌ “శ్రీ చెరుకూరి రామోజీరావు” గారు కన్నుమూత

గత కొంతకాలంగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న రామోజీరావు ఇటీవల పరిస్థితి విషమించడంతో నానక్ గూడలోని స్టార్ హాస్పిటల్‌లో( Star Hospital, Nanak Guda ) జాయిన్ అయ్యారు.

ఈనాడు గ్రూప్ అధినేత గౌ “శ్రీ చెరుకూరి రామోజీరావు” గారు కన్నుమూత

రాత్రి నుంచి వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు.అలా చికిత్స పొందుతూనే శనివారం ఉదయం 4:50 నిమిషాలకు ఆయన కన్నుమూశారు.

డాక్టర్లు బాగానే ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది.ఆయన మరణంతో తెలుగు రాష్ట్రాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

కొంతసేపట్లో రామోజీరావు భౌతికకాయాన్ని ఫిలిం సిటీ లోని ఆయన నివాసానికి తరలించనున్నారు.ఈనాడు పత్రిక స్థాపించి మీడియా మొగల్ గా రామోజీరావు పేరు తెచ్చుకున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోని పెదపారుపూడిలో 1936 నవంబర్ 16లో జన్మించిన రామోజీరావు పూర్తి పేరు చెరుకూరి రామోజీ రావు.

దూరదృష్టి గల భారతీయ వ్యాపారవేత్తగా, మీడియా వ్యవస్థాపకుడుగా బాగా గుర్తింపు తెచ్చుకున్నారు.జర్నలిజం, మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్‌లో ఈనాడు గ్రూప్‌ని( Enadu Group ) ప్రథమ స్థానంలో నిలిపారు.

ఈనాడు హై క్వాలిటీ న్యూస్ పేపర్ గా ప్రతి ఒక్కరి మనసుల్లో నిలిచిపోయింది.

ఆయన స్టార్ట్ చేసిన ETV నెట్‌వర్క్ తెలుగు రాష్ట్రాల్లో సూపర్ పాపులర్ అయ్యింది.

ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్ సిటీని కూడా ఆయనే స్టార్ట్ చేశారు. """/" / మీడియా రంగంలో రామోజీరావు విశేషమైన సేవలను అందించారు.

ఆయన నాయకత్వంలో లక్షలాది మందికి వార్తలను, సమాచారాన్ని అందజేస్తూ ఈనాడు ఇంటి పేరుగా మారింది.

మార్గదర్శి చిట్ ఫండ్, ప్రియా ఫుడ్స్‌తో ( Guided Chit Fund, Priya Foods )సహా ఫైనాన్స్, హాస్పిటాలిటీ, ఆహార పరిశ్రమలలో విజయవంతమైన వ్యాపారాలను ఆయన ప్రారంభించారు.

తెలుగు సినిమాపై రామోజీరావు ఒక పాజిటివ్ ఇంపాక్ట్ కలిగించారు.ప్రేక్షకులు నచ్చే ఎన్నో సినిమాలు తీసి సినిమా రంగానికి కూడా మంచి సేవలను అందించారు.

నాలుగు ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్, ఐదు నంది అవార్డులతో సహా పలు అవార్డులను సంపాదించారు.

"""/" / జర్నలిజం, సాహిత్యం, విద్య రంగాలలో రామోజీరావు చేసిన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం ఆయనను రెండవ అత్యున్నత పౌర పురస్కారం అయిన పద్మ విభూషణ్‌తో సత్కరించింది.

 రామోజీ రావు 2024, జూన్ 8న కన్నుమూశారు, కానీ తరతరాలకు స్ఫూర్తినిచ్చే గొప్ప మహానేతగా తెలుగువారి గుండెల్లో నిలిచిపోతారు.

ఇక మీదట మహేష్ బాబు స్పెషల్ క్యారెక్టర్స్ చేయబోతున్నారా..?

ఇక మీదట మహేష్ బాబు స్పెషల్ క్యారెక్టర్స్ చేయబోతున్నారా..?