నేడు భారత్- బంగ్లా మధ్య పోరు.. వరుణుడు కరుణిస్తాడా..అడ్డగిస్తాడా..!

ఆసియా కప్ ( Asia Cup )టోర్నీలో శ్రీలంక జట్టు ఫైనల్ చేరి భారత్ తో తలపడేందుకు సిద్ధమైంది.

సూపర్-4 దశలో భారత జట్టు బంగ్లాదేశ్ జట్టుతో నామమాత్రపు మ్యాచ్ ఆడాల్సి ఉంది.

అయితే ఈ మ్యాచ్ కు వర్ష గండం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

ఆసియా కప్ లో భాగంగా శ్రీలంక వేదికగా జరుగుతున్న ప్రతి మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగిస్తూనే ఉంది.

భారత్-శ్రీలంక మ్యాచ్ మినహా ప్రతి మ్యాచ్ కు వరుణుడు ఇబ్బందులు కలిగించాడు.ఇక భారత్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ రిజర్వ్ డేకు కూడా వెళ్లిన సంగతి తెలిసిందే.

నేడు జరిగే మ్యాచ్ కూడా వర్షం ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంది. """/" / అయితే నేటి మ్యాచ్ లో ఏ జట్టు గెలిచినా పెద్దగా ఫలితం ఉండదు.

ఎందుకంటే భారత్ ( India )ఇప్పటికే ఫైనల్ కు చేరింది.బంగ్లాదేశ్ సూపర్-4 దశలో ఆడిన రెండు మ్యాచ్లలో ఓడి ఫైనల్ కు చేరే అవకాశాలను కోల్పోయింది.

దీంతో ఆసియా కప్ టోర్నీలో నాకౌట్ రౌండ్లో ఇంటిదారి పట్టిన తొలి జట్టుగా బంగ్లాదేశ్ నిలిచింది.

"""/" / తాజాగా జరిగిన మ్యాచ్లో శ్రీలంక( Sri Lanka ) చేతిలో ఓడిన పాకిస్తాన్ జట్టు ఫైనల్ చేరకుండానే ఇంటిదారి పట్టింది.

దీంతో శ్రీలంక జట్టు ఫైనల్ కు చేరింది.గత ఏడాది చివరిలో భారత్ పై బంగ్లాదేశ్ వన్డే సిరీస్ నెగ్గిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు కూడా బంగ్లాదేశ్ అలాంటి ప్రదర్శనే చేయాలని అనుకుంటుంది.భారత జట్టు కూడా కొన్ని ప్రయోగాలు చేసేందుకు సిద్ధమైంది.

భారత్- బంగ్లాదేశ్ మ్యాచ్ జరుగుతున్నంత సేపు ఆకాశం 90% మేఘావృతమై ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

లెబనాన్‌లో పేజర్ పేలుళ్ల వెనక హస్తం .. కేరళవాసి కోసం నార్వే వేట, లుకౌట్ నోటీసులు జారీ