నేడు తెలంగాణకు మరోసారి ప్రధాని మోదీ..!!
TeluguStop.com
తెలంగాణలో బీజేపీ అగ్రనేతలు ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.ఇందులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ( Narendra Modi ) ఇవాళ మరోసారి తెలంగాణకు రానున్నారు.
పర్యటనలో భాగంగా మధ్యాహ్నం 3.05 గంటలకు గుల్బర్గా నుంచి మోదీ నారాయణపేటకు రానున్నారు.
డీకే అరుణ( DK Aruna )కు మద్ధతుగా నారాయణపేటలో నిర్వహించనున్న బీజేపీ బహిరంగ సభకు మోదీ హాజరుకానున్నారు.
సాయంత్రం 4.15 గంటలకు నారాయణపేట నుంచి మోదీ హైదరాబాద్ కు రానున్నారు.
సాయంత్రం 5.10 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకోనున్న ఆయన సాయంత్రం 5.
25 గంటలకు ఎల్బీ స్టేడియానికి వెళ్లనున్నారు.ఈ క్రమంలోనే సాయంత్రం 5.
30 గంటల నుంచి సాయంత్రం 6.20 గంటల వరకు ఎల్బీ స్టేడియంలో నిర్వహించే సభకు హాజరుకానున్నారు.
కాగా కిషన్ రెడ్డి(
Kishan Reddy )కి మద్ధతుగా ఎల్బీ స్టేడియంలో మోదీ బహిరంగ సభలో పాల్గొననున్నారు.
రజనీకాంత్ బర్త్ డే స్పెషల్.. ఈ స్టార్ హీరో గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?