విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో నేడే సిల్వర్ జూబ్లీ వార్షికోత్సవం

సిరిసిల్ల శాసనసభ సభ్యులు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్( KTR ) రాకా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల( Yellareddypet ) కేంద్రంలోని విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో బుధ , గురువారం రెండు రోజుల పాటు జరిగే సిల్వర్ జూబ్లీ వార్షికోత్సవ సాంస్కృతిక కార్యక్రమాలకు సిరిసిల్ల శాసన సభ్యులు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వస్తున్నట్లు విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ కరస్పాండెంట్ ఎండి లతీఫ్( MD Latif ) తెలిపారు.

ఈ సందర్భంగా కరస్పాండెంట్ ఎండి లతీఫ్ మాట్లాడుతూ ఎల్లారెడ్డిపేట మండలంలోని అన్ని గ్రామాల ప్రజలకు అందుబాటులో పట్టణాలకు దీటుగా కార్పొరేట్ స్థాయి ఇంగ్లీష్ మీడియం హైస్కూల్( English Medium High School ) నెలకొల్పి అందరి ఆదరాభిమానాలు చూరగొని 25 సంవత్సరాలు కావస్తున్న శుభ సందర్భంగా సిల్వర్ జూబ్లీ వార్షికోత్సవాలను పురష్కరించుకుని పాఠశాల విద్యార్థులచే సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో నాస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు , జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి , జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ , జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్, ఎంపీపీ పిల్లి రేణుక కిషన్,జెడ్ పి టి సి సభ్యులు చీటీ లక్ష్మణరావు ,మండల విద్యాశాఖాధికారి రఘుపతి , స్థానిక సర్పంచ్ నేవూరి వెంకట్రెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులను,వివిధ పార్టీల నాయకులను,స్థానిక ప్రెస్ క్లబ్ ప్రతినిధులను , విద్యార్థులను విద్యార్థుల తల్లిదండ్రులను ఆహ్వానిస్తున్నట్లు కరెస్పాండెంట్ లతీఫ్ తెలిపారు.

జుట్టు బలోపేతం కోసం ఈ కాఫీ హెయిర్ మాస్క్ ను తప్పక ట్రై చేయండి!