నేడే ముహూర్తం.. బీజేపీ మాస్టర్ ప్లాన్ !

మరో మూడు నెలల్లో జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలని బీజేపీ గట్టి పట్టుదలగా ఉంది.

ప్రస్తుతం సౌత్ రాష్ట్రాలలో బీజేపీ ఉనికి కనుమరుగౌతున్న వేళ తెలంగాణ ఎన్నికలు ఆ పార్టీకి కీలకంగా మారాయి.

ఎందుకంటే దక్షిణాదిలో అధికారంలో ఉన్న ఒకే ఒక్క కర్నాటక రాష్ట్రం( Karnataka ) కూడా బీజేపీ నుంచి చేజారిపోయింది.

దాంతో తెలంగాణ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించి సౌత్ లో పరువు నిలుపుకోవాలని చూస్తున్నారు కమలనాథులు.

అయితే కర్నాటక ఎన్నికల ముందు తెలంగాణలో కూడా యమ దూకుడు ప్రదర్శించిన కమలనాథులు ఆ ఎన్నికల తరువాత మాత్రం ఒక్కసారిగా డీలా పడ్డారు.

"""/" / ప్రస్తుతం రాష్ట్రంలో బి‌ఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఉన్న జోష్ తో పోల్చితే కాషాయదళం స్లో అయిన సంగతి స్పష్టంగా అర్థమౌతుంది.

అయితే ఎన్నికలకు ఎంతో సమయం లేకపోవడంతో ఇక దూకుడు పెంచాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు.

వరుసగా పార్టీ అగ్రనేతలు రాష్ట్రంలో పర్యటనలు చేపట్టేలా ప్రణాళికలు రచిస్తున్నారు.అందులో భాగంగానే నేడు తెలంగాణకు అమిత్ షా రానున్నారు.

ఖమ్మంలోని చేవెళ్ళలో జరిగే బహిరంగ సభకు ఆయన హాజరు కానున్నారు.అయితే అమిత్ షా( Amit Shah ) రాక సందర్భంగా రాష్ట్ర కమలనాథులు గట్టిగానే వ్యూహాలు రచించారు.

బి‌ఆర్‌ఎస్ మరియు కాంగ్రెస్ నుంచి అసంతృప్త వాదులను పార్టీలోకి ఆహ్వానించి వారికి కాషాయ కండువ కప్పాలని చూస్తున్నారు.

"""/" / ఆ పార్టీ నేత ఈటెల రాజేందర్ మాట్లాడుతూ( Etela Rajender ).

బి‌ఆర్‌ఎస్ మరియు కాంగ్రెస్ పార్టీ నుంచి 22 మంది తమ పార్టీలోకి రావడానికి ఆసక్తి చూపుతున్నారని, సరైన సమయంలో వారిని పార్టీలోకి ఆహ్వానిస్తామని చెప్పుకొచ్చారు.

దీన్ని బట్టి చూస్తే నేడు అమిత్ షా రాక సందర్భంగా ఏమైనా చేరికలు జరిగే అవకాశం ఉందా అనేది పోలిటికల్ సర్కిల్స్ లో చర్చ నడుస్తోంది.

ఇటీవల మొదటి జాబితా ప్రకటించిన బి‌ఆర్‌ఎస్ లో సీట్లు లభించని నేతలు కొంత అసంతృప్తి గా ఉన్నారు.

వారు పార్టీ మారే ఆలోచనలో కూడా ఉన్నారు.దీంతో బి‌ఆర్‌ఎస్ అసంతృప్త నేతలంతా నేడు బీజేపీ క్యాంప్ లో ప్రత్యక్షమతారా అనేది ఆసక్తికరంగా మారింది.

మొత్తానికి గెలుపే లక్ష్యంగా ఉన్న బీజేపీ అసంతృప్త వాదులకు గట్టిగానే గాలం వేస్తోంది.

వీడియో: ఆకాశంలో ఆశ్చర్యపరిచే దృశ్యం.. మేఘాల్లో నడుస్తున్న మనిషి..??