నేడు ఇండియా కూటమి కోఆర్డినేషన్ కమిటీ తొలి భేటీ

దేశంలోని ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి ఏర్పాటు చేసిన ఇండియా కూటమి కోఆర్డినేషన్ కమిటీ తొలిసారిగా భేటీ కానుంది.

ఈ మేరకు ఎన్సీపీ నేత శరద్ పవార్ ఢిల్లీలోని నివాసంలో ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు.

ఇందులో ప్రధానంగా 2024 లోక్ సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, సీట్ల పంపకాలు వంటి పలు కీలక అంశాలపై సమన్వయ కమిటీ చర్చించనుందని తెలుస్తోంది.

దాంతోపాటు ఇండియా కూటమి భవిష్యత్ కార్యాచరణపై కూడా ఈ సమావేశంలో నేతలు చర్చించనున్నారు.

అయితే వివిధ పార్టీలకు చెందిన సుమారు పద్నాలుగు మంది నాయకులతో సమన్వయ కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

కాగా ఈ కమిటీ ఇండియా కూటమిలో అత్యున్నత విధాన నిర్ణాయక విభాగంగా పని చేస్తుందన్న విషయం తెలిసిందే.

వయనాడ్ బాధితుల విషయంలో మంచి మనస్సు చాటుకున్న విక్రమ్.. అన్ని రూ.లక్షల విరాళమంటూ?