నేడు విద్యుత్ సబ్ స్టేషన్లలో గ్రీవెన్స్ డే…!

సూర్యాపేట జిల్లా: హుజూర్ నగర్, పాలకవీడు, గరిడేపల్లి మండలాల్లోని విద్యుత్ సబ్ స్టేషన్లో విద్యుత్ వినియోగదారుల సమస్యలపై నేడు గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆయా మండలాల విద్యుత్ శాఖ ఏఈలు బూర వెంకటరాం ప్రసాద్ (హుజూర్ నగర్), బానోతు నరసింహ నాయక్ (పాలకవీడు), రవిరాల నగేష్ (గరిడేపల్లి) ఒక ప్రకటనలో తెలిపారు.

ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ గ్రీవెన్స్ డే ఉంటుందన్నారు.

గ్రీవెన్స్ డే కు విద్యుత్ శాఖ జిల్లా, డివిజన్,మండల అధికారులు పాల్గొంటారని తెలిపారు.

ఈ అవకాశాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోని, తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొస్తే వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పారు.

అగ్ని ప్రమాదంలో గాయాలపాలైన డిప్యూటీ సీఎం చిన్న కుమారుడు.. స్పందించిన మాజీ సీఎం