నేడు వరల్డ్ కప్ లో డబుల్ ధమాకా..ఈ రెండు జట్లు గెలిస్తే.. ఆ నాలుగుజట్లు సెమీస్ నుంచి ఔట్..!

భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ 2023( ODI World Cup 2023 ) టోర్నీలో భాగంగా నేడు రెండు కీలక మ్యాచులు జరగనున్నాయి.

ఈ మ్యాచ్ల ఫలితాలపై మిగతా జట్లు సెమీస్ రేసులో ఉన్నాయా లేదంటే సెమీస్ రేసు నుంచి తప్పుకున్నాయా అనేది ఆధారపడి ఉంది.

నేడు బెంగుళూరు లోని చిన్న స్వామి స్టేడియం వేదికగా 10:30am కు న్యూజిలాండ్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుంది.

అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా 2:00pm కు ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ మధ్య మ్యాచ్ జరగనుంది.

ఈ విషయం అందరికీ తెలిసిందే. """/" / న్యూజిలాండ్( New Zealand ) జట్టు ఆడిన ఏడు మ్యాచ్లలో నాలుగు మ్యాచ్లలో విజయం సాధించి 8 పాయింట్లతో ఉంది.

నేడు జరిగే మ్యాచ్ లో పాకిస్తాన్ పై గెలిస్తేనే న్యూజిలాండ్ సెమీస్ చేరే అవకాశం సజీవంగా ఉంటుంది.

ఒకవేళ పాకిస్తాన్ గెలిస్తే న్యూజిలాండ్ సెమీస్ చేరే అవకాశం మిగతా జట్ల ఫలితాలపై ఆధార పడాల్సి ఉంటుంది.

పాకిస్తాన్ జట్టు ఆడిన ఏడు మ్యాచ్లలో కేవలం మూడు మ్యాచ్లలో గెలిచి ఆరు పాయింట్లతో ఉంది.

పాకిస్తాన్ సెమీస్ అవకాశాలు తక్కువగానే ఉన్నాయి.కాకపోతే ఆడాల్సిన రెండు మ్యాచ్లలో విజయం సాధించడం, మిగతా జట్ల ఫలితాలు పాకిస్తాన్ సెమీస్ చేరతాయా లేదా అనేది డిసైడ్ చేస్తాయి.

"""/" / ఆస్ట్రేలియా( Australia ) జట్టు ఆడిన 6 మ్యాచ్లలో నాలుగు మ్యాచ్లలో గెలిచి సెమీస్ రేసులో ఉంది.

నేడు ఇంగ్లాండ్ పై గెలిస్తే ఆస్ట్రేలియా సెమీస్ వైపు మరో అడుగు ముందుకు వేస్తుంది.

ఈ మ్యాచ్లో గెలిస్తేనే ఆస్ట్రేలియా సెమీస్ ఆశలు సజీవంగా ఉంటాయి.ఇంగ్లాండ్ జట్టు ఆడిన ఆరు మ్యాచులలో కేవలం ఒక మ్యాచ్ లో గెలిచి ఐదు మ్యాచ్లలో ఓడింది.

ఇంగ్లాండ్ సెమీస్ చేరే అవకాశం లేదు.కానీ ఇంగ్లాండ్ ఇంకా ఆడాల్సి ఉన్న మూడు మ్యాచ్లలో గెలిస్తే సెమీస్ చేరే మిగతా జట్ల ఫలితాలు తారుమారు అయ్యే అవకాశం ఉంది.

భారత జట్టు ఏడూ విజయాలు సాధించి సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంది.ఆరు విజయాలు సాధించిన సౌత్ ఆఫ్రికా దాదాపుగా సెమీస్ చేరినట్టే.

నేడు జరిగే మ్యాచ్ లలో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లు విజయం సాధిస్తే.సెమీస్ రేసు నుంచి పాకిస్తాన్, శ్రీలంక, ఇంగ్లాండ్, నెదర్లాండ్స్, జట్లు నిష్క్రమిస్తాయి.

ఈ టోర్నీలో ఇప్పటికే బంగ్లాదేశ్ జట్టు సెమీస్ రేస్ నుండి నిష్క్రమించింది.కాబట్టి నేడు జరిగే మ్యాచ్ ఫలితాలు దాదాపుగా సెమీస్ చేరే జట్లు ఏవో డిసైడ్ చేయనున్నాయి.

దీపికకు రియల్ లైఫ్ లో కొడుకు పుడితే కల్కి అనే పేరు పెడతారా.. ఏం జరిగిందంటే?