నేడు పంజాబ్-రాజస్థాన్ మధ్య కీలక పోరు.. ఓడిన జట్టు ఇంటి ముఖం పట్టాల్సిందే..!
TeluguStop.com
నేడు పంజాబ్ - రాజస్థాన్ మధ్య జరిగే మ్యాచ్ ఇరుజట్లకు కీలకం.ఈ మ్యాచ్లో గెలిచిన జట్టుకు ప్లే ఆఫ్ చేరే అవకాశాలు ఉంటాయి.
అదే ఓడితే ఇంటి ముఖం పట్టాల్సిందే.కాబట్టి ఈరోజు జరిగే మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగనుంది.
"""/" /
రాజస్థాన్ జట్టు ఇప్పటికీ 13 మ్యాచులు ఆడి, ఆరు మ్యాచ్లలో విజయం సాధించి ఆరు పాయింట్లతో ఆరవ స్థానంలో నిలిచింది.
రాజస్థాన్ జట్టు ప్లే ఆఫ్ చేయాలంటే పంజాబ్ జట్టుపై విజయం సాధించాలి.అంతే కాకుండా ఇతర జట్ల ఫలితాలపై కూడా ఆధార పడాల్సిందే.
అది ఎలా అంటే ముంబై, బెంగుళూరు జట్లు తదుపరి మ్యాచ్లలో ఓడితే.14 పాయింట్లతో ఉంటాయి.
దీంతో ఈ రెండు జట్టతో పాటు రాజస్థాన్ జట్టు కూడా 14 పాయింట్లతోనే ఉంటుంది.
అప్పుడు రన్ రేట్ పరంగా రాజస్థాన్ మెరుగుగా ఉండడంతో.రాజస్థాన్ జట్టు ప్లే ఆఫ్ కు సాధించే అవకాశం ఉంటుంది.
"""/" /
ఇక పంజాబ్ జట్టు విషయానికి వస్తే.నేడు జరిగే మ్యాచ్లో రాజస్థాన్ పై భారీపరుగుల తేడాతో విజయం సాధించాలి.
అంతేకాకుండా ముంబై, బెంగుళూరు జట్లు తమ తదుపరి మ్యాచ్లలో ఓడితే.అప్పుడు ఈ మూడు జట్లు 14 పాయింట్ లతో ఉంటాయి.
అప్పుడు రన్ రేట్ అధికంగా ఉండే జట్టు ప్లే ఆఫ్ చేరుతుంది.కాబట్టి పంజాబ్, రాజస్థాన్ లకు నేడు జరిగే మ్యాచ్ కీలకం.
ఈ మ్యాచ్లో గెలవడం కోసం రాజస్థాన్ తమ జట్టులో ఒక మార్పు కూడా చేయనుంది.
గాయం కారణంగా గత మ్యాచ్ కు దూరమైన స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ నేడు జరిగే మ్యాచ్లో తిరిగి జట్టులోకి వస్తున్నట్లు సమాచారం.
బౌల్ట్ తుది జట్టులోకి వస్తే స్పిన్నర్ అడమ్ జంపా బెంచ్ కే పరిమితమయ్యే అవకాశం ఉంది.
ఏ జట్టు ప్లే ఆఫ్ రేసులో ఉంటుందో.ఏ జట్టు ఇంటి ముఖం పడుతుందో చూడాల్సి ఉంది.
10 నిమిషాల ప్రయాణానికి రూ. 2800 ఛార్జ్ .. ఎన్ఆర్ఐ ఫిర్యాదుతో వెలుగులోకి , ట్యాక్సీవాలా అరెస్ట్