ఖమ్మంలో ఇవాళ పొంగులేటి ఆత్మీయ సమ్మేళనం

ఖమ్మంలో ఇవాళ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు టీజేఎస్ అధ్యక్షులు కోదండరాం హాజరుకానున్నారు.

ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొంగులేటి నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాలు చివరి దశకు వచ్చాయని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే తొమ్మిది నియోజకవర్గాల్లో ఆయన ఆత్మీయ సమ్మేళనాలు కొనసాగాయి.అయితే బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన పొంగులేటి ఏ పార్టీలో చేరేది ఇంకా డిసైడ్ కాలేదు.

మరోవైపు పొంగులేటితో ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ నేతలు చర్చలు జరిపిన విషయం తెలిసిందే.

ఈ మేరకు జూన్ 2వ తేదీన పార్టీ మార్పుపై పొంగులేటి కీలక ప్రకటన చేయనున్నారు.

మోహన్ బాబు ఫ్యామిలీ లో గొడవలు ఇప్పుడప్పుడే తగ్గేలా లేవా..?