నేడే డుకాటీ డెసర్ట్‌ఎక్స్ ఇండియాలో లాంచ్.. దీని ధర, ఫీచర్లు ఇవే..
TeluguStop.com
ఇటలీకి చెందిన సూపర్‌బైక్ తయారీ కంపెనీ డుకాటీ ఈరోజు ఇండియాలో డుకాటీ డెసర్ట్‌ఎక్స్ (Ducati DesertX) అడ్వెంచర్ బైక్ లాంచ్ చేస్తోంది.
ఈ బైక్ ఇండియాలో ట్రయంఫ్ టైగర్ 900 ర్యాలీ, హోండా ఆఫ్రికా ట్విన్ వంటి వాటికి పోటీగా నిలవనుంది.
ఈ మోటార్ సైకిల్ ఇప్పటికే ఇంటర్నేషనల్ మార్కెట్లలో రిలీజ్ అయింది.ఇప్పుడు భారత వాహనదారులను కూడా పలకరించనుంది.
937సీసీ, L-ట్విన్, లిక్విడ్-కూల్డ్ ఇంజన్‌తో వచ్చే ఈ బైక్ చాలా తేలికైన బరువుతో వస్తుంది కాబట్టి దీన్ని ఎలాగంటే అలాగా రైడ్ చేయవచ్చు.
6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వచ్చే ఈ బైక్ 9,250 ఆర్‌పీఎమ్ వద్ద 110bhp, 6,500ఆర్‌పీఎమ్ వద్ద 92Nm ప్రొడ్యూస్ చేస్తుంది.
అంటే హిమాలయన్ బైక్ కంటే దీని పవర్ నాలుగు రెట్లు ఎక్కువ.టార్క్ కూడా మూడు రెట్లు అధికమని చెప్పవచ్చు.
ఫుల్లీ-ఎల్ఈడీ లైటింగ్, బ్లూటూత్- ఎనేబుల్డ్ టీఎఫ్‌టీ డిస్‌ప్లే, స్పోర్ట్, టూరింగ్, అర్బన్, వెట్, ర్యాలీ, ఎండ్యూరో అనే ఆరు రైడింగ్ మోడ్స్, క్రూయిజ్ కంట్రోల్, ఇంజన్ బ్రేక్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, వీలీ కంట్రోల్, బైడైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్, కార్నరింగ్ ABS వంటి ఎన్నో ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
"""/"/
ఈ అద్భుతమైన అడ్వెంచర్ బైక్ ధర రూ.16 లక్షల నుంచి రూ.
17 లక్షల వరకు ఉండొచ్చని సమాచారం.లడఖ్, రాన్ ఆఫ్ కచ్, శ్రీనగర్ బెంగళూరు ఊటీ, ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ తదితర ప్రాంతాల్లో ప్రకృతి అందాల్లో దూసుకెళ్లడానికి ఈ బైక్ చాలా బాగా ఉపయోగపడుతుంది.
అలానే రోడ్లు బాగోలేని ప్రదేశాల్లో కూడా ఈ బైక్ మీద చాలా సౌకర్యవంతంగా ప్రయాణాలు చేయవచ్చు.
తారక్ మూవీ ఆఫర్ కు ఓకే చెప్పి తప్పు చేసిందా.. ఈ బ్యూటీకి ఇబ్బందులు తప్పవా?