మూడు జిల్లాల సమన్వయంతో పని చేయాలి : జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావ్

సూర్యాపేట జిల్లా: లోక్ సభ ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించి,విజయవంతం చేయడానికి అందరి సహకారం కావాలని,మూడు జిల్లాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని,తమ జిల్లా నుండి పూర్తి సహకారం అందిస్తామని సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఎస్.

వెంకట్రావు తెలిపారు.నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వాడపల్లిలోని ఇండియన్ సిమెంట్స్ సమావేశ మందిరంలో అంతర్రాష్ట్ర సరిహద్దు సమన్వయ సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో పల్నాడు జిల్లా అధికారులు తమ పూర్తి సహకారాన్ని అందించారని ధన్యవాదాలు తెలిపారు.

అదే విధంగా లోక్ సభ ఎన్నికలకు సూర్యాపేట జిల్లా నుండి తమ పూర్తి సహకారాన్ని అందిస్తామన్నారు.

ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ లలో 8 శాఖల అధికారులు విధులు నిర్వహిస్తున్నారని,ఎఫ్ఎస్టి, ఎస్ఎస్టి వాహనాలకు 360 డిగ్రీస్ కెమెరాలను అమర్చడం జరిగిందని,దీనిని కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు.

నగదు,మద్యం,మత్తు పదార్థాల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు అంతర్రాష్ట్ర సరిహద్దు వద్ద నిఘాను పకడ్బందీగా ఏర్పాటు చేశామన్నారు.

ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకునే విధంగా వాట్సాప్ గ్రూపును ఏర్పాటు చేయడమే కాకుండా తెలిసిన సమాచారాన్ని వెంటనే వాట్సాప్ లో పెడుతూ ఉండాలని సూచించారు.

రెండు జిల్లాల అధికారుల సహకారంతో గత ఎన్నికల్లో మంచి ఫలితాలను సాధించామని,ఈ ఎన్నికల్లో కూడా పూర్తి సహకారం అందించాలన్నారు.

జిల్లా ఎస్పీ రాహుల్ హేగ్డే మాట్లాడుతూ జిల్లాలో నాలుగు బోర్డర్స్ లో చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని,అన్నిచోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కంట్రోల్ రూమ్ ద్వారా పరివేక్షణ చేయడం జరుగుతుందన్నారు.

ఎక్కడ కూడా ఫెర్రీకి పర్మిషన్ ఇవ్వడంలేదని,అలాగే ప్రైవేట్ బోట్స్ ని కూడా నియంత్రించాలని పల్నాడు జిల్లా అధికారులను కోరారు.

కొన్నిరకాల మద్యం రేట్లు తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రం కంటే తక్కువగా ఉన్నాయని వీటిని రాష్ట్ర సరిహద్దుల్లో నిల్వ చేయకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు.

ఇప్పటివరకు 1కోటి 91 లక్ష రూపాయలు సీజ్ చేసినట్టు తెలిపారు.ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన, పల్నాడు కలెక్టర్ శివ,నల్గొండ ఎస్పి చందనా దీప్తి,ఆదనపు కలెక్టర్లు,నోడల్ ఆదికారులు తదితరులు పాల్గొన్నారు.

వైరల్ వీడియో: ఇదేమి తినడం బాబు.. గోల్గప్పతో లైవ్ ఫిష్..