Lakshmi Devi : లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉండాలంటే.. ఈ నియమాలు చేయండి..!
TeluguStop.com
పవిత్ర వృక్షాల్లో ఒకటి, శివుని ప్రీతికరమైన ఈ మారేడు ఆకులతో శివ పూజ( Shiva Puja ) చేస్తే అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి.
మారేడు దళం మూడు భాగాల్లో త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, శివుడు కొలువుంటారు.మారేడు దళం ఇచ్చాశక్తి, జ్ఞానశక్తి, క్రియ శక్తికి సంకేతం.
ఇవి మూడు కూడా శివ స్వరూపం.అయితే శివ సహోదరి అయిన మహాలక్ష్మి దేవి( Lakshmi Devi ) హృదయం నుండి మారేడు దళం అబీర్భవించడంతోనే శివునికి ప్రీతికరమైనదని పురాణాలు చెబుతున్నాయి.
మారేడు వృక్షం చుట్టూ భక్తితో ప్రదక్షిణలు చేసి భక్తితో తాకినట్లయితే శివుడిని సందర్శించినట్లేనని ఆధ్యాత్మిక నిపుణులు కూడా చెబుతున్నారు.
అయితే ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలంటే పూజించిన మారేడాకును పర్సులో లేదా బీరువాలో లేదా క్యాష్ బాక్స్ లో ఉంచుకోవాలని చెబుతున్నారు.
"""/" /
ఆ తర్వాత ఆర్థిక బాధలు తొలగిపోవాలని మీ ఇష్ట దైవాన్ని నమస్కరించుకోవాలి.
ఇక లక్ష్మీదేవికి సంబంధించిన ఏదైనా స్తోత్రాన్ని పారాయణా చేసుకోవాలి.ఆ తర్వాత చినుకులు లేని మారేడు దళాలను రెండు లేదా మూడు ఇంటికి తెచ్చుకోవాలి.
ఇక ఒక దళాన్ని బీరువాలో ఉంచుకోవాలి.రెండోది కవర్లో ఉంచి ప్యాకెట్ లో ఉంచుకుంటే డబ్బు స్థిరంగా నిలుస్తుంది.
రోహిణి నక్షత్రం( Rohini Nakshatra ) రోజున మారేడు చెట్టు కింద పూజ చేస్తే బాధలన్నీ తొలగిపోతాయి.
ఇక సూర్యోదయం నుండి వచ్చే రోహిణి నక్షత్రం రోజు మారేడు చెట్టుకు పూజ చేస్తే సిరిసంపదలు వెళ్లి విరుస్తాయి.
రోహిణి నక్షత్రం చంద్రునికి చెందినది.ఇక చంద్రుడిని ఆధిపత్యం వహించే దైవం శ్రీ మహాలక్ష్మి.
అందుకే రోహిణి నక్షత్రం రోజున మారేడు చెట్టు వద్ద పూజ చేస్తే ఐశ్వర్యం స్థిరంగా నిలుస్తుంది.
"""/" /
మారేడు చెట్టు ఎక్కడున్నా, లేదా దేవాలయాల్లో ఉండే మారేడు చెట్టు వద్దకు వెళ్లి హుండీలో 11 రూపాయలు వేసి పూజ చేయాలి.
మారేడు చెట్టు మొదట్లో నీరు పోసి ఆవు నేతితో దీపారాధన చేయాలి.ఆ తర్వాత గంధపు సువాసన వచ్చే అగరవత్తులు వెలిగించాలి.
ఇక చెట్టు కింద కూర్చొని లక్ష్మీదేవికి సంబంధించిన అష్టోత్తరాన్ని పారాయణం చేయాలి.ఇక తమలపాకు, పండ్లు, తాంబూలం పెట్టాలి.
తమలపాకులు మూడు, రెండు తెలుపు పచ్చిపోకల వక్కలు, రెండు అరటి పండ్లు ఉంచి దక్షణగా ఐదు రూపాయలు ఉంచాలి.
ఆ తర్వాత మారేడు చెట్టు వద్ద పెట్టాలి.ఇలా ఆ మారేడు దళాన్ని క్యాష్ బ్యాక్ లో పెట్టుకుంటే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి.
CMR: గర్ల్స్ హాస్టల్‌లో రహస్యంగా 300 వీడియోలు రికార్డ్?