సూర్యాపేట జిల్లా:కోదాడ పట్టణ పరిధిలోని బాలాజీనగర్ నందు నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అర్హులైన పేదలందరికీ వెంటనే పంపిణీ చేయాలని తెలుగుదేశం పార్టీ
రాష్ట్ర కార్యదర్శి నంబూరి సూర్యం డిమాండ్ చేశారు.
బుధవారం తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి బాలాజీ నగర్ లోని డబుల్ బెడ్ రూం ఇళ్లను సందర్శించిన అనంతరం ఆయన మాట్లాడుతూ కోదాడ మున్సిపాలిటీ పరిధిలోనీ 35వార్డులో అనేకమంది పేదలున్నారని,పట్టణంలో అసలు నివాస గృహం లేనివారు చాలామంది ఉన్నారని, వారిలో కూడా కడు నిరుపేదలు చాలామంది ఉన్నారని,
అందులో నిజమైన లభ్దిదారుల ఎంపిక చేస్తేనే పేదవారికి న్యాయం జరుగుతుందన్నారు.
ప్రభత్వ అధికారులు అర్హులను గుర్తించి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అందేలాచూడాలన్నారు.ఈ కార్యక్రమంలో కోదాడ టీడీపీ పట్టణ అధ్యక్షులు ఉప్పుగండ్ల శ్రీనివాసరావు,ప్రదాన కార్యదర్శి పిడతల శ్రీనివాసరావు,రేవంత్ రెడ్డి.