చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా రేపటినుండి “బాబుతో నేను” టీడీపీ కొత్త కార్యక్రమం..!!
TeluguStop.com
స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకి( TDP Chief Chandrababu ) ఏసీబీ కోర్టు రిమాండ్ విధించటం తెలిసిందే.
దీంతో ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు.అయితే చంద్రబాబుని రాజకీయ కక్షతోనే.
అక్రమ కేసులు పెట్టి వైసీపీ ప్రభుత్వం అరెస్టు చేయించిందని.టీడీపీ ( TDP )నేతలు విమర్శలు చేస్తున్నారు.
ఇదే సమయంలో చంద్రబాబు అరెస్టుని జాతీయస్థాయిలో నాయకుల సైతం ఖండిస్తున్నారు.చంద్రబాబు అరెస్ట్ కావటంతో సోమవారం టీడీపీ రాష్ట్ర బంద్ నిర్వహించడం జరిగింది.
కాగా తాజాగా రేపటినుండి "బాబుతో నేను" ( I Am With Babu )పేరుతో ప్రజా చైతన్య కార్యక్రమాలను నిర్వహించడానికి తెలుగుదేశం పార్టీ పూనుకుంది.
ఈ మేరకు లోగోను కూడా ఆవిష్కరించడం జరిగింది.రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా మండల, నియోజకవర్గలలో తెలుగుదేశం పార్టీ నేతలు రిలే నిరాహార దీక్షలు చేపట్టబోతున్నారు.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుని ఏవిధంగా కుట్రలు పన్ని వైసీపీ ( YCP )అరెస్టు చేయించిందో ప్రతి గ్రామంలో ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేయడానికి తెలుగుదేశం పార్టీ రెడీ అయింది.
మరోపక్క చంద్రబాబుకి బెయిల్ కోసం హైకోర్టులో టీడీపీ నేతలు న్యాయపోరాటం చేస్తూ ఉన్నారు.
పరిస్థితి ఇలా ఉండగా నేడు జైలులో చంద్రబాబుతో ఆయన సతీమణి భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణి కలిశారు.