ఇంట్లోని ఉల్లిపాయలు కుళ్ళిపోకుండా ఉండాలంటే.. ఈ టిప్స్ ని ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే..?

మన దేశంలో ఉల్లిగడ్డ( Onion ) లేని వంటగది అసలు ఉండదు.ప్రతి వంటకంలో కూడా ఉల్లిపాయను ఉపయోగించాల్సిందే.

అది వెజ్ అయినా నాన్ వెజ్ అయినా ఏదైనా తప్పనిసరిగా ఉండాల్సిందే.అందుకే వాటిని ఎక్కువ మొత్తంలో ఒకేసారి ఇంట్లో తెచ్చి పడేస్తారు.

అలాంటప్పుడు వాటిని పడవకుండా కాపాడుకోవడం ఎంతో అవసరం.సాధారణంగా ఉల్లిపాయలు ఎక్కువ కాలం నిలువ ఉంటాయి.

కానీ వాటిని నిలువ చేసే విధానం సరిగ్గా ఉండాలి.ఏమాత్రం ఆశ్రద్ధ చేసినా అవి కుళ్ళిపోతాయి.

అందుకే ఈరోజు ఉల్లిపాయలను నిల్వ చేసుకునే విధానం గురించి తెలుసుకుందాం. """/" / ముందుగా మీరు మంచి ఉల్లిపాయలను ఎంచుకోవాలి.

మీరు కొనేముందు వాటిని శుభ్రంగా పరీక్షించాలి.అవి గట్టిగా, పొడిగా ఎటువంటి దెబ్బలు లేకుండా, మెత్తటి మచ్చలు వంటివి లేకుండా ఉండే వాటిని ఎంచుకోవాలి.

అలాగే ఉల్లిపాయలు కుళ్ళిపోవడానికి దారి తీసేది తేమ.ఈ తేమను నిరోధించడానికి చల్లని పొడి వాతావరణంలో( Cold Dry Weather ) నిల్వ చేయాలి.

మీ వంట గదిలో మంచి గాలి ప్రవహించే ప్రదేశంలో వీటిని నిల్వ చేయాలి.

అలాగే వేడి, ప్రత్యక్ష సూర్యకాంతి పడకుండా ఉండేలా చూసుకోవాలి.కాబట్టి వాటిని పొడిగా ఉండే ప్రదేశంలో మాత్రమే ఉంచాలి.

"""/" / ముఖ్యంగా చెప్పాలంటే ఉల్లిపాయలు తడిగా ఉంటే వాటిని నిల్వ చేసే ముందు ఒక గుడ్డ తో శుభ్రంగా తుడిచి ఆరబెట్టాలి.

ప్లాస్టిక్ సంచులలో ఉల్లిపాయలను ఉంచడానికి బదులుగా బుట్టలను ఉపయోగించాలి.ఈ కంటైనర్లు ఉల్లిపాయ చుట్టూ గాలి ప్రసరించడానికి అనుమతిస్తాయి.

ఇంకా చెప్పాలంటే తేమ పెరగకుండా వాటిని కుళ్ళిపోకుండా చేస్తాయి.ప్రత్యామ్నాయంగా మీరు వాటిని ఓపెన్ కార్డ్‌బోర్డ్ పెట్టెలలో( Open Cardboard Boxes ) కూడా నిల్వ చేయవచ్చు.

ఉల్లిపాయలు కొన్ని పండ్లు, కూరగాయలు పండించడాన్ని వేగవంతం చేసే వాయువుని విడుదల చేస్తాయి.

ఇది వేగంగా చెడిపోవడానికి దారి తీసింది.ఉల్లిపాయలు ఇతరు ఉత్పత్తుల నుంచి ముఖ్యంగా బంగాళాదుంపల నుంచి దూరంగా ఉంచాలి.