బరువు తగ్గాలంటే ఈ తప్పులు అస్సలు చేయకూడదు..
TeluguStop.com
ప్రస్తుత కాలంలో ప్రపంచవ్యాప్తంగా యువతకు అతి బరువు ప్రధాన సమస్యగా మారింది.నేటి కాలం యువత వాళ్ళు తీసుకుంటున్న ఫాస్ట్ ఫుడ్స్ వల్ల ఎక్కువగా బరువు పెరుగుతున్నారు.
ఇలా అతి బరువు పెరగడం వల్ల ఈ మధ్యకాలంలో చాలామంది కి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి.
బరువు తగ్గించుకోవడానికి చాలామంది యువత చాలా రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు.కొంతమంది తమ ఫిట్నెస్ కోసం జిమ్ లోకి వెళ్లి కసరత్తులు చేస్తూ ఉంటారు.
శరీర బరువు తగ్గించుకోవాలంటే ఈ పొరపాట్లను అస్సలు చేయకూడదు.మన నేటి యువత ఉదయం కప్పు కాఫీ త్రాగనిదే బెడ్డు పైనుంచి దిగడం లేదు.
అయితే ఉదయం నిద్ర లేచిన వెంటనే వీటిని తాగడం వల్ల మన శరీరంలోని ఎక్కువ నీరు బయటికి పోయి మన శరీరం డిహైడ్రేషన్ కి గురి అవుతుంది.
దీనివల్ల మన శరీరంలో జీర్ణ వ్యవస్థ పనితీరు బలహీనపడుతుంది.అలా జరుగుతే మరింత బరువు పెరిగే అవకాశం కూడా ఉంది.
మనం ఉదయాన్నే తాగే టి, కాఫీలకు బదులుగా నిమ్మరసం గోరువెచ్చని నీరు తాగాలి.
ఇలా మనం ప్రతిరోజు నిమ్మరసం గోరువెచ్చని నీరు త్రాగడం వల్ల మన శరీరంలోని విష వ్యర్ధాలు బయటికి వెళ్తాయి.
మనం రోజు ఉదయం తీసుకునే అల్పాహారం విషయంలో కూడా మనం చాలా శ్రద్ధ తీసుకోవాలి.
మనం ఉదయం చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం అసలు మంచిది కాదు.
"""/"/
షుగర్ తీసుకోవడం వల్ల త్వరగా బరువు తగ్గరు.చక్కెర ఎక్కువగా తీసుకుంటే మీరు త్వరగా బరువు పెరుగుతారు.
చక్కెర ఎంత తక్కువగా తీసుకుంటే అంత త్వరగా బరువు తగ్గుతారు.బరువు తగ్గడానికి మనకు సరిపడినంత నిద్ర కచ్చితంగా అవసరం.
మన శరీరంలో విటమిన్ డి శాతం తక్కువగా ఉన్నా బరువు పెరిగే అవకాశం ఉంది.
అందుకోసం ప్రతిరోజు ఉదయం ఉదయం సూర్య కిరణాల లో చిన్నచిన్న వ్యాయామాలు చేస్తూ ఉండాలి.