బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేయాలంటే.. ఏ బ్యాంక్ ఎంత ఛార్జ్ చేస్తుందో తెలుసా..!

ప్రస్తుతం చాలామంది ఒకటికంటే ఎక్కువ సేవింగ్స్ అకౌంట్ కలిగి ఉన్నారు.అయితే కొందరు ఒకటి కంటే ఎక్కువ సేవింగ్ అకౌంట్స్ ను మెయింటెన్ చేయలేకపోతున్నారు.

అలాంటప్పుడు ఒక బ్యాంక్ అకౌంట్ ఉంచుకొని మిగతా బ్యాంక్ అకౌంట్స్ క్లోజ్ చేయాలంటే ఏ బ్యాంక్ ఎంత ఛార్జ్ చేస్తుందో తెలుసుకుందాం.

బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేయాలంటే కచ్చితంగా బ్యాంకులు ఛార్జ్ చేస్తాయి.బ్యాంక్ అకౌంట్ ఉంటే కచ్చితంగా మినిమం బ్యాలెన్స్ మైంటైన్ చేయాలి.

ఇంకా ఏటీఎం ఛార్జెస్ లాంటివి కూడా చెల్లించాల్సి ఉంటుంది.స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా:( State Bank Of India ) ఈ బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్ తెరిచిన 14 రోజులలోపు క్లోజ్ చేస్తే ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు.

అదే 15 రోజుల తర్వాత నుంచి 12 నెలల లోపు మాత్రం అకౌంట్ క్లోజ్ చేయాలంటే రూ.

500 చెల్లించాల్సిందే.పైగా రూ.

500 కు జీఎస్టీ కలిపి చెల్లించాల్సి ఉంటుంది.HDFC బ్యాంక్: ( HDFC Bank )ఈ బ్యాంకు లో కూడా సేవింగ్స్ అకౌంట్ తెరిచిన 14 రోజులకు అకౌంట్ క్లోజ్ చేస్తే ఎలాంటి ఛార్జీలు చెలించాల్సిన అవసరం లేదు.

15 రోజుల తర్వాత నుంచి 12 నెలల లోపు మాత్రం అకౌంట్ క్లోజ్ చేయాలంటే రూ.

500 చెల్లించాల్సిందే.సీనియర్ సిటిజెన్లకు అయితే రూ.

300 మాత్రమే ఛార్జ్ చేస్తారు.12 నెలల తర్వాత అకౌంట్ క్లోజ్ చేయాలంటే ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం ఉండదు.

"""/" / ఐసీఐసీఐ బ్యాంక్: ( ICICI Bank )ఈ బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్ ను 30 రోజులలోపు క్లోజ్ చేస్తే ఎలాంటి చార్జీలు చెల్లించాల్సిన అవసరం ఉండదు.

31 రోజుల తర్వాత ఏడాదిలోపు బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేయాలంటే రూ.500 చెల్లించాల్సిందే.

"""/" / కెనరా బ్యాంక్:( Canara Bank ) ఈ బ్యాంకు లో కూడా సేవింగ్ అకౌంట్ తెరిచిన 14 రోజులలోపు క్లోజ్ చేస్తే ఎలాంటి చార్జీలు ఉండవు.

15 రోజుల తర్వాత నుంచి ఏడాదిలోపు బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేయాలంటే రూ.

200 చెల్లించాల్సిందే.ఏడాది దాటిన తర్వాత క్లోజ్ చేయాలంటే రూ.

100 తో పాటు జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది.బ్యాంక్ అకౌంట్ ఉండే వ్యక్తి చనిపోతే మాత్రం ఎలాంటి చార్జీలు చెల్లించాల్సిన అవసరం ఉండదు.

బ్యాంక్ అకౌంట్ క్లోజింగ్ చేయాలంటే బ్యాంక్ మేనేజర్ కు కారణం తెలుపుతూ లెటర్ రాయాల్సి ఉంటుంది.

బ్యాంక్ పాస్ బుక్,చెక్ బుక్, డెబిట్ కార్డులు బ్యాంకుకి సమర్పించాల్సి ఉంటుంది.కొన్ని బ్యాంకులలో అకౌంట్ క్లోజర్ ఫామ్స్ ఉంటాయి.

ఆ ప్రాసెస్ కంప్లీట్ చేసి అకౌంట్ క్లోజ్ చేయవచ్చు.

కమల్ అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఇండియన్2 ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే?