ఆ ఒక్క సీన్ కోసం అఖిల్ డైరెక్టర్లను ఆ రేంజ్ లో ఇబ్బంది పెట్టాడట!

తెలుగు సినీ నటుడు, అక్కినేని నాగార్జున వారసుడు అక్కినేని అఖిల్.ఈయన టాలీవుడ్ సినీ పరిశ్రమలో అఖిల్ సినిమా తో హీరోగా పరిచయమయ్యాడు.

ఆ తర్వాత హలో, మిస్టర్ మజ్ను సినిమాలలో నటించగా అఖిల్ కు అంత గుర్తింపు రాలేదు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు అఖిల్.కానీ ఊహ తెలియక ముందు నటించిన సినిమాలో మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ సాధించాడు అఖిల్.

ఇంతకీ ఆ సినిమా ఏంటంటే.1995లో డైరెక్టర్ శివనాగేశ్వరరావు దర్శకత్వంలో తెరకెక్కిన సిసింద్రీ సినిమా.

ఈ సినిమాతో అఖిల్ తొలిసారిగా సినీ పరిశ్రమకు పరిచయమయ్యాడు.బాలనటుడిగా అఖిల్ బాగా నటించాడు.

అంతేకాకుండా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.అయితే ఈ సినిమా లో అఖిల్ నటించేటప్పుడు అతని వయసు కేవలం ఒక సంవత్సరం మాత్రమే.

ఇక అంత చిన్న బాబు ఆ వయసులో సినిమా తీయడం అంటే చాలా కష్టమైన పనే.

అంతేకాకుండా సినీ దర్శక నిర్మాతలు అంత చిన్న వయసు లో అఖిల్ తో సినిమా తీయించడం అంటే నిజంగా గొప్ప విషయమే అనుకోవాలి.

కానీ నిజానికి ఆ ఒక్క సీన్ కోసం అఖిల్ డైరెక్టర్ లను తెగ ఇబ్బంది పెట్టాడట.

"""/"/ కంప్యూటర్ గ్రాఫిక్స్ విధానం ఈ సినిమాతోనే తొలిసారిగా పరిచయం కాగా ఆ అవకాశంతో అఖిల్ తో కొన్ని సీన్లను చేశారు దర్శక నిర్మాతలు.

ఇక సినిమాల్లో రోడ్డుపై లారీ వస్తుండగా అఖిల్ దానికింద ఉన్న సన్నివేశం అందర్నీ తెగ ఆశ్చర్యపరిచింది.

నిజంగా అఖిల్ లారికి ఎదురుగా కూర్చున్నాడా.ఆ సమయంలో అఖిల్ భయపడ లేదా అనే సందేహాలు మీకు ఎప్పుడో రావచ్చు.

కానీ అది గ్రాఫిక్స్ తో తీశారట.అన్నపూర్ణ స్టూడియో ముందు రోడ్డుమీద బ్లూ క్లాత్ తో పరిచి సెట్ వేసారట.

దానిమీద అఖిల్ ఆడుకుంటూ ఉన్న షూట్లను తీశారట.ఇక అక్కడే ఓ లారీ సపరేట్ వస్తున్నా షార్ట్ ను తీశారట.

తర్వాత వీటిని గ్రాఫిక్ చేసే వ్యక్తి డెవలప్ చేసి ఒక మూడు రోజుల్లో పంపించగా.

అందులో కొన్ని సరి చేయక తప్పలేదట‌ డైరెక్టర్లకు.ఇక ఆ షూట్ లను మళ్ళీ తీయించి వాటిని మళ్ళీ డెవలప్ చేశారట.

అంతేకాకుండా ఈ సినిమాలో మరో రెండు సీన్ లను కూడా గ్రాఫికల్ విధానంతోనే చేయించారట.

మొత్తానికి ఈ సీన్లు చేయడానికి డైరెక్టర్స్ కు బాగా ఇబ్బందులు ఎదురయ్యాయట‌.ఇక ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమాలో నటిస్తున్నాడు.

ఇటీవలే జరిగిన అఖిల్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేయగా.

ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.ఇక ఈ సినిమా జూన్ 19న విడుదల కానుంది.

అంతే కాకుండా తాజాగా అఖిల్ మరో సినిమా 'ఏజెంట్' అఫీషియల్ టీజర్ విడుదల కాగా అందులో అఖిల్ రఫ్ లుక్ లో కనిపించగా ఈ లుక్ బాగా ఆకట్టుకుంది.

ఇక ఈ సినిమా కూడా ఈ ఏడాదే విడుదల కానుంది.

ఏపీ ఎన్నికల పోలింగ్ శాతంపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు..!!