Upasana : అతి త్వరలోనే ముగ్గురు కాబోతున్నాము.. ఉపాసన పోస్ట్ వైరల్?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్( Ram Charan ) సతీమణి ఉపాసన( Upasana ) గురించి మనందరికీ తెలిసిందే.

ఉపాసన ఏ ముహూర్తాన తల్లి కాబోతున్న విషయాన్ని ప్రకటించిందో కానీ అప్పటినుంచి తరచూ ఈమెకు సంబంధించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంది.

త్వరలోనే రామ్ చరణ్ ఉపాసన తల్లిదండ్రులు కాబోతున్న విషయం తెలిసిందే.ప్రస్తుతం ఉపాసన ఎనిమిది నెలల గర్భవతి.

వారసుడు కోసం మెగా కుటుంబ సభ్యులతో పాటు మెగా అభిమానులు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

తరచూ తన ప్రెగ్నెన్సీ కి సంబంధించిన విషయాన్ని తన అభిమానులతో పంచుకుంటూనే ఉంది ఉపాసన.

"""/" / ఈ క్రమంలోనే తాజాగా మరో విషయాన్ని వెల్లడించింది.చరణ్‌, ఉపాసన దంపతులకు ప్రజ్వల ఫౌండేషన్‌ బహుమతి అందించింది.

పుట్టబోయే బిడ్డ కోసం ప్రత్యేకంగా ఒక ఉయ్యాలను సిద్ధం చేసి సదరు సంస్థ వారు ఉపాసనకు అందజేశారు.

ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉపాసన తాజాగా ఇంస్టాగ్రామ్ లో ఒక పోస్ట్‌ చేసింది.

ప్రజ్వల ఫౌండేషన్‌ నుంచి ఇలాంటి హృదయపూర్వక బహుమతి పొందినందుకు ఎంతో ఆనందంగా ఉంది.

యంత్రాలు ఉపయోగించకుండా హ్యాండ్ క్రాఫ్ తో తయారు చేసిన ఈ ఉయ్యాలకు ప్రాముఖ్యత ఉంది.

బలం, ఆశకు ఇది ప్రతీక. """/" / పరివర్తన, ఆత్మగౌరవాన్ని ఇది సూచిస్తుంది.

నాకు పుట్టబోయే బిడ్డ కూడా ఈ విలువలు కలిగి ఉండాలని కోరుకుంటున్నాను అని తెలిపింది ఉపాసన.

ఈ సందర్బంగా ఆమె ప్రజ్వల సంస్థకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.అలాగే తన భర్త రామ్ చరణ్ తో కలిసి దిగిన కొన్ని ఫొటోలను షేర్‌ చేసిన ఆమె తాము అతి త్వరలో ముగ్గురం కానున్నాం అని తెలిపింది ఉపాసన.

ఆ పోస్ట్ పై మెగా అభిమానులు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందిస్తున్నారు.జూనియర్ చెర్రీ కోసం మేము కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నాము అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

యూఎస్ కాంగ్రెస్‌లో ఆరుగురు భారత సంతతి నేతల ప్రమాణ స్వీకారం!!