నాన్న కార్మికుడిగా పని చేసిన చోటే కమిషనర్ గా కూతురు.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

తండ్రి ఎక్కడైతే కార్మికుడిగా పని చేశారో కూతురు అక్కడే కమిషనర్ గా( Commissioner ) పని చేయడం అరుదుగా మాత్రమే జరుగుతుంది.

మన జీవితంలో జరిగే ఇలాంటి ఘటనలు ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తాయని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు.

తండ్రి పడే కష్టాన్ని చిన్నతనంలో ప్రత్యక్షంగా చూసిన కూతురు ఉన్నత స్థానానికి చేరుకుని తండ్రి కష్టాలను తీర్చాలని భావించడం జరిగింది.

బరువైన లక్ష్యాన్ని ఎంచుకున్న కూతురు అందరూ గర్వించే విధంగా ఉన్నత స్థాయి ఉద్యోగం సాధించి ఎంతోమందికి స్పూర్తిగా నిలిచారు.

తమిళనాడు రాష్ట్రంలోని( Tamil Nadu ) తిరువారూర్ జిల్లాకు చెందిన దుర్గ( Durga ) పారిశుద్ధ్య కార్మికుడి కూతురు కాగా శేఖర్,( Sekhar ) సెల్వి( Selvi ) దంపతులకు ఆమె ఏకైక కూతురు కావడం గమనార్హం.

మన్నార్ కుడి కార్పొరేషన్ లో శేఖర్ పారిశుద్ధ్య కార్మికుడిగా పని చేసేవారు.మన్నార్ కుడి ప్రభుత్వ పాఠశాలలో దుర్గ ప్లస్ 2 వరకు చదివారు.

"""/" / ఆ తర్వాత దుర్గ అతి కష్టంతో రాజగోపాలస్వామి ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ లో ఫిజిక్స్ లో డిగ్రీ పూర్తి చేశారు.

అయితే బాగా చదువుకుంటున్న సమయంలోనే మదురాంతకంకు చెందిన నిర్మల్ తో ఆమెకు వివాహం జరిగింది.

అయితే పెళ్లి తర్వాత చదువు విషయంలో భర్త పూర్తిస్థాయిలో సహాయసహకారాలు అందించడం కొసమెరుపు.

ప్రస్తుతం దుర్గ తిరువారూర్ లో మున్సిపల్ కమిషనర్ గా( Municipal Commissioner ) పని చేస్తున్నారు.

"""/" / తాత, తండ్రి పారిశుద్ధ్య కార్మికులుగా జీవనం సాగించగా గ్రూప్2 పరీక్షలో పాసైన దుర్గ నిన్న మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించడం జరిగింది.

2019 సంవత్సరం నుంచి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న దుర్గ ఎట్టకేలకు లక్ష్యాన్ని సాధించడం కొసమెరుపు.

దుర్గ సక్సెస్ స్టోరీని ఎంత ప్రశంసించినా తక్కువేనని చెప్పవచ్చు.దుర్గ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత స్థానాలకు ఎదగాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

మెకానిక్‌కి జాక్‌పాట్‌ .. రూ.25 కోట్ల లాటరీ తగలడంతో..