‘నాని 31’ టైటిల్ గ్లింప్స్.. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వీడియో అదిరింది!

న్యాచురల్ స్టార్ నాని( Nani ) ఏడాదికి రెండు మూడు సినిమాలు చేస్తూ కెరీర్ లో దూసుకు పోతున్నాడు.

అయితే ఈ మధ్య అంత ఫాస్ట్ గా సినిమాలు చేయడం లేదు.నాలుగేళ్లలో ఈయన నుండి వచ్చింది రెండు మూడు మాత్రమే.

దీన్ని బట్టే అర్ధం అవుతుంది.ఈయన సినిమాలు ఎంత ఆచి తూచి చేస్తున్నాడో.

ఇక ఈయన గత సినిమా దసరా ( Dasara Movie ) బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మరో సినిమాను చేస్తున్నాడు.

ప్రజెంట్ 'హాయ్ నాన్న' ( Hi Nanna )సినిమాను రిలీజ్ కు రెడీగా ఉంచి మరో సినిమాను అనౌన్స్ చేసాడు.

వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో కొత్త సినిమాను అనౌన్స్ చేయగా అప్పుడే నటీనటుల వివరాలు ప్రకటిస్తూనే రోజుకొక అప్డేట్ ఇస్తున్నారు.

"""/" / తాజాగా ఈ సినిమా నుండి టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేయగా సరికొత్త సన్సెప్టు తో ఈసారి ఆడియెన్స్ ను ఆకట్టుకోవడానికి సిద్ధం అవుతున్నట్టు తెలుస్తుంది.

''సరిపోదా శనివారం'' ( Saripodhaa Sanivaram ) అనే టైటిల్ ను ఫిక్స్ చేస్తూ గ్లింప్స్ ను రిలీజ్ చేసారు.

సాయి కుమార్ వాయిస్ ఓవర్ తో ఉన్న ఈ వీడియో ఆడియెన్స్ ను అమితంగా ఆకట్టుకుంటుంది.

"""/" / వివేక్ ఆత్రేయలో ఈ యాంగిల్ ఎప్పుడు చూడలేదు అంటూ టీజర్ చూసిన వారంతా కామెంట్స్ చేస్తున్నారు.

కాగా ఈ సినిమాలో ప్రియాంక అరుళ్ మోహన్( Priyanka Arul Mohan ) ను హీరోయిన్ గా కన్ఫర్మ్ అయ్యింది.

అలాగే కీలక పాత్రలో ఎస్ జే సూర్య నటిస్తున్నట్టు ప్రకటించారు.ఇక డివివి ఎంటర్టైన్మెంట్స్ పై నిర్మిస్తున్న ఈ సినిమాను అక్టోబర్ 24న విజయదశమి రోజున లాంచ్ చేయనున్నారు.

దేవర సక్సెస్ క్రెడిట్ ఎన్టీఆర్ కే దక్కుతుందా.. ఈ రేంజ్ లో ఎవరూ యాక్ట్ చేయలేరంటూ?