తిరుపతి: దేశీయ ఆవు నెయ్యి తయారీ కేంద్రం నిర్మాణానికి శంకుస్థాప‌న

‌తిరుప‌తిలోని శ్రీ వేంక‌టేశ్వ‌ర గోసంర‌క్ష‌ణ‌శాల‌లో దేశీయ ఆవు పాలతో నెయ్యి తయారీ కేంద్రం నిర్మాణానికి టీటీడీ ఛైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి శుక్రవారం శంఖుస్థాపన చేశారు.

చైర్మన్ కు అర్చకులు సాంప్రదాయంగా స్వాగతం పలికారు.అనంతరం ఈవో తో కలసి శంఖుస్థాపన ప్రాంతంలో చైర్మన్ శ్రీ సుబ్బారెడ్డి పూజలు చేసి శాస్త్రోక్తంగా పనుల ప్రారంభానికి శ్రీకారం చుట్టారు.

ఈ సందర్భంగా చైర్మన్ శ్రీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు.శ్రీవారి ఆలయంలో స్వామివారికి కైంకర్యాలు, దీపారాధన, అన్న ప్రసాదాల తయారీకి రోజుకు 60 కిలోల నెయ్యి అవసరం అవుతుందన్నారు.

గత ఏడాది మే 1వ తేదీ నుంచి స్వామివారి కి ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన ఉత్పత్తులతో ప్రసాదాల తయారీ ప్రారంభించామని ఆయన తెలిపారు.

ఇందులోభాగంగా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడంతో పాటు స్వామివారి అభిషేకం, ప్రసాదాల తయారీకి దేశీయ ఆవుల పాలు, నెయ్యి ఉపయోగించాలని పాలక మండలి తీర్మానించిందని శ్రీ సుబ్బారెడ్డి చెప్పారు.

ఇందుకోసం రోజుకు 4 వేల లీటర్ల పాలు అవసరం అవుతాయనీ, వీటిని సేకరించడానికి దేశీయ ఆవుల కొనుగోలుకు నిర్ణయం తీసుకున్నామన్నారు.

అయితే ఈ ఆవులను దాతలు ముందుకు వచ్చి విరాళంగా అందిస్తున్నారని తెలిపారు.రూ.

3 కోట్ల వ్య‌యంతో ముంబ‌యికి చెందిన ఆఫ్కాన్స్ సంస్థ విరాళంగా నెయ్యి తయారీ ప్లాంట్ నిర్మించ‌నుందని ఆయన చెప్పారు.

"""/" /ఎనిమిది నుంచి తొమ్మిది నెలల్లో ఈ ప్లాంట్ నిర్మాణం పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

గోశాల లోని దేశీయ గోవుల నుండి రోజుకు 4 వేల లీట‌ర్ల పాల‌ను సేక‌రించి అధికారులు నెయ్యి తయారీ కేంద్రానికి అందిస్తారన్నారు.

ఇక్క‌డ 60 కిలోల నెయ్యి త‌యారుచేసి టీటీడీ కి అందిస్తారని చెప్పారు.ఇందులో మిగిలే మ‌జ్జిగ‌ను తిరుమల లోని అన్న‌ప్ర‌సాద కేంద్రాలకు అందిస్తారని ఆయన వివరించారు.

ఆఫ్కాన్ సంస్థ మేనేజర్ శ్రీ స్వామి, గోశాల డైరెక్టర్ డాక్టర్ హరినాథ రెడ్డి, పశువైద్య విశ్వవిద్యాలయం విస్తరణ విభాగం డైరెక్టర్ డాక్టర్ వెంకట నాయుడు పాల్గొన్నారు.

అనంతరం చైర్మన్, ఈవో గోశాలకు కొత్తగా తీసుకుని వచ్చిన దేశీయ ఆవులను చూసి వాటికి మేత అందించారు.

వాటి సంరక్షణ కోసం ప్రత్యేకంగా చేస్తున్న ఏర్పాట్ల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.

"""/" / H3 Class=subheader-styleదేవున్నీ రాజకీయాల్లోకి లాగుతున్నారు : చైర్మన్/h3p మూడు రోజుల క్రితం తిరుపతి లో జరిగిన తోపులాట గురించి మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి సమాధానాలు ఇచ్చారు.

ప్రధాన ప్రతిపక్షం, దానికి వంత పాడుతున్న ఎల్లో మీడియా దేవున్ని కూడా రాజకీయాల్లోకి లాగుతున్నారని మండిపడ్డారు.

సర్వదర్శనం స్లాటెడ్ టోకెన్ల జారీ సందర్భంగా తిరుపతి లో కొంత మేరకు తోపులాట జరిగినా దేవుడి దయవల్ల ఎవరికీ ప్రాణా పాయం జరగలేదన్నారు.

సంఘటన జరిగిన గంటలోపే టోకెన్లు లేకుండానే భక్తులను తిరుమలకు అనుమతించేలా అధికారులకు ఆదేశాలు జారీ చేసి పరిస్థితి అదుపులోకి తెచ్చామన్నారు.

ఈ సంఘటన పై అసత్య ఆరోపణలు, దుష్ప్రచారం చేస్తున్న రాజకీయ పార్టీలు, నాయకులు, ఒక వర్గం మీడియా భక్తుల్లో భయాందోళనలు కల్పించే కుట్ర చేస్తున్నారని శ్రీ సుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

"""/" / దేవుడు అన్నీ చూస్తున్నారని, భక్తులు ఇలాంటి వాటిని నమ్మే పరిస్థితి లేదని ఆయన చెప్పారు.

టీడీపీ పాలనలో తిరుమల లో ఇలాంటి సంఘటనలు జరగలేదా ? భక్తులు కంపార్ట్ మెంట్ల గేట్లు విరిచిన సంఘటనలు గుర్తు లేవా అని ప్రశ్నించారు.

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశంతో సామాన్య భక్తులకు సంతృప్తి కర దర్శనం చేయిస్తుంటే, స్వామివారి ని భక్తులకు దూరం చేసే ప్రయత్నం చేస్తున్నామని ఆరోపణలు చేయడం దురదృష్టకరమన్నారు.

తిరుమలలో క్యూ లైన్లలో ఉండే భక్తులకు పాలు, ఆహారం, తాగునీరు, ఇతర సదుపాయాలు కల్పిస్తున్నాము.

భక్తుల సదుపాయం కోసం తిరుమలలో మరో రెండు అన్న ప్రసాద కేంద్రాలు ఏర్పాటు చేస్తామని, వీటికి అదనంగా ఇప్పటికే అన్న ప్రసాద కౌంటర్లు ఏర్పాటు చేశామని శ్రీ సుబ్బారెడ్డి చెప్పారు.

నేనెందుకు పట్టించుకోవాలి… షర్మిల వివాదంపై బాలయ్య కామెంట్స్ వైరల్!