సూర్యాపేట జిల్లా: తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ ( MLA Gadari Kishore Kumar )అనుచిత వ్యాఖ్యలపైశుక్రవారం అఖిలపక్షాల ఆధ్వర్యంలో నిర్వహించిన తిరుమలగిరి పట్టణ బంద్వి జయవంతం అయింది.
అఖిలపక్షాలు ఇచ్చిన స్వచ్ఛంద బంద్ కు పట్టంలోని అన్ని వ్యాపార వర్గాల వారు ఉదయం నుంచి స్వచ్ఛందంగా సహకరించారు.
బంద్ ను విఫలం చేయాలని అధికార పార్టీ నేతలు, పోలీసులు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి.
అయినా పోలీసులు నియంతృత్వ ధోరణితో ప్రతిపక్ష నాయకులను ఉదయం నుంచి నియోజకవర్గంలో వివిధ మండలాల్లో అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు.
ఈ సందర్భంగా అఖిల పక్షాల నేతలు మాట్లాడుతూ స్వచ్చందంగా బంద్ పాటిస్తున్న వారిని పోలీసులు అక్రమ అరెస్టులు చేయడం దుర్మార్గమన్నారు.
అధికార పార్టీ నేతలు,పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఎమ్మెల్యే బేషరతుగా క్షమాపణలు చెప్పేంతవరకు తమ పోరాటం ఆగదని, ఉద్యమిస్తూనే ఉంటామని హెచ్చరించారు.
బంద్ సందర్భంగా ఉదయం 5 గంటల నుండి అఖిలపక్ష పార్టీలకు చెందిన కాంగ్రెస్, బీజేపీ,ఎమ్మార్పీఎస్, వైఎస్ఆర్ టిపి,బీఎస్పీ,సిపియుఎస్ఐ ఇతర ప్రజా సంఘాల కార్యకర్తలు పట్టణంలో స్కూటర్ ర్యాలీ నిర్వహించారు.
అధికార పార్టీకి చెందిన కొంతమంది వ్యక్తులు బంద్ ను విఫలం చేయాలని ఉద్దేశంతో బలవంతంగా కొన్ని షాపులను తెరిపించారు.
అయినా ఆవ్యాపారులు మళ్లీ తమ దుకాణాలు మూసివేశారు.దీంతో అధికార పార్టీ నాయకులు వేసిన ఎత్తుగడ ఫలించలేదు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎల్.నరేష్,ఎమ్మార్పీఎస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కందుకూరి సోమన్న, అనుకూరి శీను,బిజెపి జిల్లా నాయకులు గిందాల్,బీఎస్పీ మండల శాఖ అధ్యక్షులు మల్లెపాక కృష్ణ,ఎంపీటీసీ జిమిలాల్ భాస్కర్ తో పాటు పలువురిని అరెస్టు చేశారు.
తిరుమలగిరి పట్టణ బంద్ కు ఇద్దరు సిఐలు,పదిమంది ఎస్సైలు,50 మంది కానిస్టేబుళ్ళతో బందోబస్తు ఏర్పాటు చేశారు.
హిమాచల్ ప్రదేశ్ ప్రమాదకర రహదారుల్లో బస్సు ప్రయాణం.. నెటిజన్ల ప్రశంసలు!