భక్తులకు శుభవార్త చెప్పిన తిరుమల పుణ్యక్షేత్రం.. ఈరోజు శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు విడుదల..

తిరుమల పుణ్యక్షేత్రానికి ప్రతి రోజు ఎన్నో లక్షల మంది భక్తులు తరలివచ్చి శ్రీవారిని దర్శించుకుంటూ ఉంటారు.

తిరుమలకు వచ్చిన భక్తులు శ్రీవారిని దర్శించుకుని పూజలు, అభిషేకాలు చేస్తూ ఉంటారు.అంతేకాకుండా మరి కొంతమంది భక్తులు స్వామి వారికి కానుకలలను తల నీలాలను సమర్పిస్తూ ఉంటారు.

తిరుమల పుణ్య క్షేత్రం ఎప్పుడు భక్తులతో రద్దీగా ఉంటుంది.అలాంటి తిరుమల శ్రీవారి భక్తులకు దేవస్థానం శుభవార్త చెప్పింది.

తిరుమల లో ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.

మార్చి, ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన టికెట్లు కొటా ను ఆన్ లైన్ లో విడుదల చేసింది.

అంతే కాకుండా రోజుకు 500 చొప్పున ఈ టికెట్లను విడుదల చేయనున్నారు.వీటితో పాటు వసతి గదులకు సంబంధించిన టోకెన్లను కూడా అందుబాటులో ఉంచనుంది.

తిరుమలలోని గోకులం కార్యాలయంలో ఆఫ్‌ లైన్‌లో శ్రీవాణి టికెట్లు జారిని తిరుమల తిరుపతి దేవస్థానం ఇటీవల మళ్ళీ మొదలు పెట్టింది.

ఫిబ్రవరి నెలలో ఇప్పటికే 750 టికెట్లు ఆన్ లైన్ లో విడుదల చేసింది.

అందువల్ల ఫిబ్రవరి 28 వరకు రోజుకు 150 శ్రీవాణి టికెట్లను తిరుమల లో అందిస్తున్నారు.

"""/"/ ఇంకా చెప్పాలంటే మరో వైపు శ్రీకాళహస్తి మహాశివరాత్రి వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం పల్లకీ సేవ మహోత్సవం ఎంతో ఘనంగా జరిగింది.

అశేష భక్త కోటి సమక్షంలో జ్ఞానాంబిక సోమస్కంద మూర్తిని వివాహమాడిన విషయం తెలిసిందే.

అయితే ఈ వివాహానికి ముందుగానే గంగాదేవితో పరిణయం అయిందన్న విషయాన్ని తెలుసుకున్న జ్ఞానాంబిక ఆగ్రహించి అలకబూనడం అమ్మవారిని బుజ్జగిస్తూ అయ్య వారు గంగాదేవిని వెంట పెట్టుకొని వెనుక వెంబడిస్తూ సాగిన ఉత్సవన్ని చూసిన భక్తులు తన్మయం పొందారు.

వైరల్ వీడియో: కొడుకు బౌలింగ్ లో బౌండరీ వెలుపల క్యాచ్ పట్టిన తండ్రి