ఖాళీగా ఉన్నా వైకుంఠం క్యూ కాంప్లెక్స్.. దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే..?
TeluguStop.com
తిరుమల కొండ పై భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.ప్రతి సోమవారం నిర్వహించే చతుర్దశ కలశ విశేష పూజను తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది.
విగ్రహాల పరిరక్షణలో భాగంగా ఆగమ సలహాదారుల సూచనల మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఈ నిర్ణయం తీసుకుంది.
ఆదివారం రోజున స్వామి వారిని దాదాపు 75 వేల మంది భక్తులు దర్శించుకున్నారు.
దాదాపు 26 వేల మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు.3.
6 కోట్ల రూపాయలు భక్తులు హుండీ ద్వారా స్వామి వారికి కానుకలుగా సమర్పించారు.
"""/" /
ఇక వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు ఖాళీగా ఉండడంతో ఎక్కడ వేచి ఉండే పని భక్తులకు లేకుండా పోయింది.
శ్రీవారి దర్శనానికి భక్తులను తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బంది నేరుగా ఆలయంలోకి అనుమతించారు.
ఉదయం ఏడు గంటల తర్వాత వచ్చిన సర్వదర్శనం టైం స్లాట్ టోకెన్లు లేని భక్తులను భక్తులకు స్వామి దర్శనానికి 14 గంటల సమయం పడుతుంది.
ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనానికి మూడు గంటల సమయం మాత్రమే పడుతుంది.శ్రీవారి దేవాలయంలో వైఖానస ఆగమశాస్త్రం ప్రకారం శ్రీ వేంకటేశ్వరుడికి అర్చకులు కైంకర్యాలు నిర్వహిస్తున్నారు.
"""/" /
ఇందులో భాగంగా సోమవారం ప్రత్యూష కాల ఆరాధనతో దేవాలయ ద్వారములను అర్చకులు తెరిచారు.
బంగారు వాకిలి వద్ద శ్రీ వెంకటేశ్వర సుప్రభాత స్తోత్రం తో స్వామి వారిని మేలుకొల్పారు.
ఆ తర్వాత తోమాల, అర్చన సేవలు నిర్వహించిన అర్చకులు ప్రాతఃకాల ఆరాధనతో భాగంగా స్నపన మండపంలో శ్రీ కొలువు శ్రీనివాసమూర్తి వారి సమక్షంలో దర్భార్ నిర్వహించారు.
శ్రీవారికి పంచాంగ శ్రవణం, హుండీ జనాకర్షణ విన్నవించి, బెల్లంతో కలిపిన నువ్వుల పిండిని స్వామి వారికి నైవేద్యంగా సమర్పించారు.
కెనడా ఎన్నికలు : ఖలిస్తానీయులకు షాక్ … ఎన్డీపీ నేత జగ్మీత్ సింగ్ దారుణ పరాజయం